మోహన్ లాల్ ఎంతటి విలక్షణ నటుడో ఆయన గత మూణ్నాలుగేళ్లలో నటించిన సినిమాల్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఒక కథకు ఇంకో కథకు సంబంధం లేకుండా ఆయన ఎంచుకునే సినిమాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అంత పెద్ద స్టార్ అయినా.. ఆ ఇమేజ్ తనకు అడ్డు తగలకుండా ఎంతో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటారాయన. మూడేళ్ల కిందట ఆయన చేసిన ‘దృశ్యం’ ఓ పెద్ద సెన్సేషన్. ఇప్పుడు అదే తరహాలో ‘ఒప్పం’ కూడా కేరళలో ప్రకంపనలు రేపుతోంది. ఇటీవలే విడుదలైన ఈ థ్రిల్లర్ మూవీ సూపర్ హిట్టయింది. ఒక్క కేరళలోనే కాదు.. సౌత్ ఇండియా అంతటా ఈ సినిమా చర్చనీయాంశం అవుతోంది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా హాట్ టాపిక్కే.
‘దృశ్యం’ తరహాలోనే ‘ఒప్పం’ను కూడా నాలుగైదు భాషల్లో రీమేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ రీమేక్ హక్కుల కోసం పోటీ మొదలైంది. తమిళ ‘దృశ్యం’లో నటించిన కమల్ హాసనే.. ‘ఒప్పం’ రీమేక్ లోనూ నటిస్తాడంటున్నారు. మోహన్ లాల్ పోషించిన అంధ వికలాంగుడి పాత్రపై కమల్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారట. ఉత్కంఠ రేపే కథాకథనాలు కూడా ఆయనకు బాగా నచ్చాయట. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ ఆటోమేటిగ్గా వెంకీ పేరు వినిపించడం సహజమే. ఐతే ఆయన స్పందన ఎలా ఉందో తెలియదు. జగపతి బాబు లాంటి నటుడు కూడా ఈ పాత్రకు బాగా సరిపోతాడన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎవరు చేస్తారన్నది పక్కనబెడితే.. ఈ సినిమా తెలుగులో రీమేక్ కావడమైతే పక్కా అంటున్నారు.