20 ఏళ్ల కిందటే తీశానంటున్న కమల్‌

Update: 2015-06-30 16:15 GMT
దృశ్యం సినిమా అటు మలయాళంలో ఇటు తెలుగులో సెన్సేషనల్‌ హిట్టయింది. ఇప్పుడు హిందీలో, తమిళంలో కూడా రీమేక్‌ అయ్యింది. కమల్‌ హాసన్‌ లాంటి పెద్ద నటుడు దృశ్యం కాన్సెప్ట్‌ నచ్చి సినిమా చేశాడంటే మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్‌ తాను గొప్ప సినిమానే తీశానని కాలర్‌ ఎగరేయవచ్చు. ఐతే దృశ్యం తనకెంతో నచ్చిన మాట వాస్తవమే కానీ.. తాను 20 ఏళ్ల కిందటే ఇలాంటి సినిమా తీశానంటున్నాడు కమల్‌.

''90ల్లో నేను నటించిన మహానది సినిమా గుర్తుండే ఉంటుంది. జీతు జోసెఫ్‌ మహానది సినిమా చూశారో లేదో కానీ.. అది కూడా ఇలాంటి జానర్లోనే తెరకెక్కింది. అది కూడా ఓ కామన్‌మేన్‌ తన కూతుర్ని కాపాడుకోవడానికి ఎలాంటి సాహసం చేశాడన్న కథాంశంతోనే తెరకెక్కింది. ఐతే సినిమా తీసిన విధానం, కథ సాగే తీరు వేరుగా ఉంటాయి. దృశ్యంలో మరింత ఉత్కంఠ ఉంటుంది'' అని చెప్పారు కమల్‌.

'పాపనాశం'లో తనకు భార్యగా నటించిన గౌతమి గురించి చెబుతూ.. ''ఆమె విషయంలో నాకో బాధ ఉండేది. ఫిమేల్‌ ఆర్టిస్టులంతా సినిమా కళను బాగా అవగాహన చేసుకునే సమయానికి రిటైరయ్యే పరిస్థితి వస్తుంది. గౌతమి విషయంలో కూడా అలాగే జరిగింది. కానీ గౌతమి ఆ ఫీలింగ్‌ను అధిగమించి పాపనాశం సినిమాలో నటించింది'' అన్నారు కమల్‌.

Tags:    

Similar News