ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటనతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే రాజకీయ బరిలోకి దూకిన కమల్ రానున్న ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.
తమిళనాడు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో రాజకీయ వ్యూహాలను కమల్ సిద్ధం చేస్తున్నారు. 2021 మే నెలలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు కమల్ హాసన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. తాను సైతం ఏదో ఒక స్థానం నుంచి పోటీచేస్తానని.. మీడియాకు త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తానని తెలిపారు.
రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై కమల్ స్పందించారు. ఆయన రాకను స్వాగతించారు. త్వరలోనే తామిద్దరం కలిసి ఓ చిత్రంలో నటిస్తామని తెలిపారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలకు ముందు సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నానన్నారు.