'తాప్సీ బీ-గ్రేడ్ యాక్టర్.. నేను రిజెక్ట్ చేసిన సినిమాల కోసం నిర్మాతలను అడుక్కుంటుంది'

Update: 2021-06-30 16:30 GMT
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. నిత్యం ఏదొక ఇష్యూ పై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. బాలీవుడ్ ప్రముఖులతో కూడా గొడవలు తెచ్చుకున్న కంగనా.. ఆ మధ్య హీరోయిన్ తాప్సీ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇటీవల కంగనా ట్విట్టర్ ఖాతాను తొలగించడం పట్ల తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కంగనా ట్విట్టర్ లో లేకపోవడం వల్ల తానేమీ మిస్ అవ్వడం లేదని.. ఎందుకంటే ఆమెకు నా లైఫ్ లో ఎలాంటి ప్రాధాన్యత లేదని తాప్సీ చెప్పింది.

అయితే తాప్సీ పన్నూ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను రిజెక్ట్ చేసిన ఆఫర్స్ కోసం ప్రొడ్యూసర్స్ కు కాల్ చేసి తాప్సీ అడుక్కుండేదని కంగనా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. ఏమైనప్పటికీ ఫిల్మ్ గర్ల్ తాప్సీ నా పేరు లేకుండా పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నించాలి అని కంగనా రాసుకొచ్చింది. మరొక పోస్ట్‌ లో "బి గ్రేడ్ యాక్టర్స్ తమని తాము ప్రమోట్ చేసుకోడానికి.. తమ కెరీర్ కోసం తన పేరుని లేదా స్టైల్ ని లేదా ఇంటర్వ్యూలు లేదా జనరల్ స్ట్రాటజీలు అనుసరించడాన్ని పట్టించుకోను. వాస్తవానికి వాళ్ళు నా పేరు ఉపయోగించుకొని ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. నేను కూడా వైజయంతీ మాల - శ్రీదేవి - వహీదా రెహ్మాన్ వంటి వారి నుంచి ఇన్స్పిరేషన్ పొందాను. కానీ నేనెప్పుడూ వారిని అగౌరవపరచలేదు. ఇతరులను క్రిందికి లాగి పైకి ఎదగాలని ప్రయత్నించేవారికి వారి స్థానాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది'' అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Tags:    

Similar News