ఆ హీరోయిన్ని దొంగ అనేసిన కంగనా

Update: 2016-11-01 07:30 GMT
బాలీవుడ్లో కంగనా రనౌత్ పెద్ద ఫైర్ బ్రాండ్. ఎవరిని ఎప్పుడు టార్గెట్ చేస్తుందో తెలియదు. కానీ ఎవరిని ఎంత మాటైనా అనేయగలదు. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోను పట్టుకుని ఆమె ఎన్నేసి మాటలందో తెలిసిందే. కొందరు ఆమెది కాన్ఫిడెన్స్ అంటారు.. ఇంకొందరు యారొగెన్స్ అంటారు. ఎవరు ఏమన్నా ఆమె పట్టించుకోదు. మాటల తూటాలు పేల్చుతూ ఉంటుంది. తాజాగా ఆమె టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాను టార్గెట్ చేసుకుంది. హీరోయిన్లలో మరో కోణాన్ని బయటికి తీస్తున్న నేహా ధూపియా షోలో కంగనా ప్రియాంక చోప్రా మీద సంచలన వ్యాఖ్యలు చేసింది.

అమెరికన్ టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా సూపర్ పాపులరైన ప్రియాంక గురించి నేహా మాట్లాడుతూ.. ఇండియన్ హీరోయిన్ల స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లిన ప్రియాంకకు ఎలాంటి అవార్డిస్తావు అని అడిగితే.. ఆమె ప్రపంచంలోనే అత్యుత్తమ దొంగ అనేసింది కంగనా. అంతే కాక ప్రియాంకది ‘ఫేక్ స్మైల్’ అని.. ఆమె నవ్వులో నిజాయితీ ఉండదని వ్యాఖ్యానించింది కంగనా. నిజానికి కంగనాకు.. ప్రియాంకకు మంచి ఫ్రెండ్షిప్పే ఉంది. వీళ్లిద్దరూ కలిసి ‘ఫ్యాషన్’ సినిమా కూడా చేశారు. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. రెండేళ్ల కిందట కంగనాకు ఉత్తమ జాతీయ నటిగా.. ‘మేరీకోమ్’ సినిమాకు జ్యూరీ పురస్కారం దక్కినపుడు ఇద్దరూ కలిసి పార్టీ కూడా ఇచ్చారు. మరి అంత మంచి బంధం ఉన్న ప్రియాంక గురించి కంగనా ఈ కామెంట్లు ఎందుకు చేసిందో.. ఏంటో మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News