ఓరి దేవుడ‌! బాహుబ‌లికే ఎస‌రు!!

Update: 2019-04-12 05:42 GMT
``అతిగా ఆశ ప‌డే మ‌గాడు.. అతిగా ఆవేశ ప‌డే ఆడ‌ది సుఖ‌ప‌డిన‌ట్టు చ‌రిత్ర‌లో లేదు!!`` అంటూ పంచ్ విసిరారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. `న‌ర‌సింహా` చిత్రంలోనిది ఈ డైలాగ్. ఆ డైలాగు బ్లాక్ బ‌స్ట‌ర్.. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌రే. కానీ రియాలిటీలో మాత్రం ఆ డైలాగ్ ఫ్లాప్ అని ప్రూవ్ చేస్తోంది క్వీన్ కంగ‌న‌. త‌న‌దైన శైలిలో నోటి దురుసు చూపిస్తూనే.. అతిగా ఆవేశ ప‌డుతూనే.. పురుషాధిక్య ప్ర‌పంచాన్ని జ‌యించ‌డం ద్వారా విక్ట‌రీని ఖాతాలో వేసుకోవ‌డం త‌న‌కే చెల్లింది.

ప్ర‌స్తుతం కంగ‌న రైజింగ్ గురించి స‌ర్వ‌త్రా ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. రంగుల ప్ర‌పంచంలో తాను అనుకున్న‌ది సాధించుకున్న ధీర‌వనిత‌గా - రియ‌ల్ క్వీన్ గా కంగ‌న గురించి పొగిడేస్తున్నారంతా. మ‌ణిక‌ర్ణిక చిత్రం కీల‌క ఘ‌డియ‌ల్లో డైల‌మాలో ప‌డిన‌ప్పుడు కెప్టెన్ సీట్ లాక్కుని సినిమాని స‌క్సెస్ చేసి చూపించిన రియ‌ల్ క్వీన్ గా కంగ‌న పేరు మార్మోగిపోయింది. ఇక ఇదే ఉత్సాహంలో కంగ‌న పాత శ‌త్రువుల్ని చీల్చి చెండాడింది. శ‌త్రువులు ఎవ‌రూ నోరెత్త‌కుండా తిట్ల‌తో తూట్లు పొడిచింది. ఇదిలా ఉండ‌గానే మ‌రో ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రానికి కంగ‌న సంత‌కం చేసింది. ఆరుసార్లు ముఖ్య‌మంత్రిగా త‌మిళ‌నాడును పాలించిన అమ్మ జ‌య‌లలిత బ‌యోపిక్ `త‌లైవి`లో టైటిల్ పాత్ర పోషిస్తోంది. దీంతో పాటే మ‌రో భారీ ఎపిక్ డ్రామాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు కంగ‌న రెడీ అవుతుండ‌డం ప్ర‌స్తుతం జ‌నంలో హాట్ టాపిక్ గా మారింది. దర్శ‌కురాలిగా రెండో ప్ర‌య‌త్న‌మే భారీ ఎపిక్ అంటే ఆషామాషీ అనుకునేరు. అది బాహుబ‌లి - ప‌ద్మావ‌త్, మ‌ణిక‌ర్ణిక‌ల కంటే బిగ్ ప్రాజెక్ట్ అని కంగ‌న చెబుతోంది. ``స్క్రిప్టు లాక్ చేశాం. త్వ‌ర‌లోనే ఫోటో షూట్ చేసి రివీల్ చేస్తాం`` అంటూ ప్ర‌క‌టించింది.

క్వీన్ ఇస్తున్న వ‌రుస‌ ట్విస్టులు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతోంది! ఇంత‌కీ బాహుబ‌లినే కొట్టేసే ఈ భారీ ఎపిక్ మూవీ స్టోరి ఏంటి? అంటే.. ఇది క్రీడానేప‌థ్యంలో ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రిత‌మే కంగ‌న క‌బ‌డ్డీ ప్రాక్టీస్ చేస్తూ క‌నిపించింది. దాంతో ఇది స్పోర్ట్స్ డ్రామా అని ఫిక్స‌య్యారంతా. మ‌రోవైపు కంగ‌న న‌టిస్తున్న తాజా చిత్రాలు మెంట‌ల్ హై క్యా, పంగ చిత్రాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. 2019లో కొత్త సినిమాల ప్రారంభోత్స‌వాలు ఓవైపు, రిలీజ్ లు వేరొక వైపు .. క్వీన్ షెడ్యూల్స్ చూస్తుంటే ఊపిరి స‌లుపుతుందా? అన్నంత బిజీగా ఉంది. అన్న‌ట్టు బాహుబ‌లినే కొట్టేస్తాన‌ని ధీమాగా చెబుతోంది అంటే క్వీన్ లో ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళికి కంగ‌న రూపంలో థ్రెట్ ఎదురైన‌ట్టే. ఓరి దేవుడ‌!!
Tags:    

Similar News