బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు ఆమె సోదరి రంగోలీ చండేల్ లు ఈమద్య కాలంలో ఇంటర్వ్యూలు మరియు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్స్ పై రంగోలీ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్ లు పెద్ద ఎత్తున దుమారంను రేపుతున్నాయి. గతంలో వీరు చేసిన వ్యాఖ్యల కారణంగా పరువు పోయిందంటూ నటుడు ఆదిత్య పంచోలి మరియు ఆయన భార్య జరీనాలు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా కంగనా సిస్టర్స్ ను స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ అయ్యాయి.
కెరీర్ ఆరంభంలో ఆదిత్య పంచోలి తనను గృహ నిర్భందం చేశాడంటూ కంగనా ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగనా వ్యాఖ్యలను సమర్ధిస్తూ రంగోలీ సోషల్ మీడియా ద్వారా తన సోదరిని ఆదిత్య రేప్ కూడా చేశాడంటూ ఆరోపించింది. ఆ సమయంలో తాము కేసు పెట్టామని.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యిందంటూ కంగనా సిస్టర్స్ పేర్కొన్నారు. అయితే ఆదిత్య పంచోలి మాత్రం తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని.. వారు చేస్తున్నవన్ని కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ వాదిస్తూ వస్తున్నాడు.
తన పరువు పోయేలా పదే పదే తనను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న కారణంగా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆదిత్య కోర్టుకు వెళ్లాడు. ఇప్పటి వరకు కంగనా సిస్టర్స్ తరపున వారి న్యాయవాది కేసు వాయిదాలకు హాజరు అవుతూ వచ్చాడు. ఈసారి తప్పనిసరిగా కోర్టు విచారణకు కంగనా సిస్టర్స్ రావాల్సిందే అంటూ కోర్టు ఆదేశించింది. దాంతో ఈ స్టార్ హీరోయిన్ సిస్టర్స్ వెళ్లక తప్పేలా లేదు. ఈ కేసులో ఓడిపోతే కంగనా సిస్టర్స్ భారీ మొత్తంలో ఆదిత్యకు అమౌంట్ చెల్లించాల్సి ఉంటుందనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.