ఒక సినిమా హిట్టవగానే పారితోషకం పెంచడం.. సినిమా ఫ్లాప్ అవగానే కొంచెం కోత వేసుకోవడం కామనే. ఐతే కంగనా రనౌత్ మాత్రం ఆ టైపు కాదట. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా తనకు పారితోషకాలు ఇవ్వాల్సిందేనని.. తాను ఈ విషయంలో డిస్కౌంట్లు లాంటివేమీ ఇవ్వనని తెగేసి చెబుతోంది కంగనా. ఆమె ప్రధాన పాత్రలో ఇటీవలే ‘రంగూన్’ అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్.. సైఫ్ అలీ ఖాన్ ఇతర ముఖ్య పాత్రలు చేసిన సినిమాను విశాల్ భరద్వాజ్ రూపొందించాడు. విశాల్ సినిమాలకు ప్రతిసారీ మంచి రివ్యూలొస్తాయి. కానీ కలెక్షన్లుండవు. ‘రంగూన్’ కూడా ఆ కేటగిరిలోనే చేరింది. ఐతే ఈ సినిమాలో కంగన పెర్ఫామెన్స్ మాత్రం అద్భుతం అన్నారంతా.
ప్రశంసల సంగతెలా ఉన్నా.. సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి తాను పారితోషకం విషయంలో డిస్కౌంట్లు ఇస్తానని మాత్రం ఆశించొద్దు అని చెబుతోంది కంగనా. తన ఫెయిల్యూర్ ని సొమ్ము చేసుకోవాలని జనాలు అనుకుంటున్నారని.. తాను రెమ్యూనరేషన్లో డిస్కౌంట్ ఇస్తానని ఆశిస్తున్నారని.. అలాంటివేమీ జాన్తా నై అని తేల్చి చెప్పింది కంగనా. కొందరు తన దగ్గరికి వచ్చి తన సినిమా ఆడకపోవడం గురించి ప్రస్తావించారని.. ఐతే పారితోషకం విషయంలో కాంట్రాక్టులో ఇలా ఓ సినిమా ఫెయిల్యూర్ అయితే అనే క్లాజ్ ఏమీ లేదని.. తాను సినిమా కోసం డేట్లు కేటాయించి.. కష్టపడుతున్నపుడు.. ఒక పాత్రను సమర్థంగా పోషిస్తున్నపుడు ముందు అనుకున్న ప్రకారం పారితోషకం ఇవ్వాల్సిందేనని.. ఫెయిల్యూర్లను బట్టి డిస్కౌంట్లేమీ ఉండవని ఆమె స్పష్టం చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/