కన్నడ సినిమాలు దున్నేయడం ఖాయమే?

Update: 2023-01-22 06:30 GMT
కన్నడ సినీ పరిశ్రమ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కన్నడ సినీ పరిశ్రమ కేజిఎఫ్ ఎంట్రీతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేజిఎఫ్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఆ తర్వాత కన్నడలో సూపర్ హిట్ గా నిలుస్తున్న సినిమాలను ఇతర భాషల్లో డబ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాక కొంతమంది కన్నడ సినిమాలనే పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 ఇప్పటికే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్నాయి. కబ్జా అనే సినిమాలో ఉపేంద్రతో పాటు కిచ్చా సుదీప్ కూడా నటిస్తుంటే... మరో సినిమాలో ఉపేంద్ర ఒక్కడే కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక అర్జున్ సర్జా మేనల్లుడు దుర్వాసన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అదేవిధంగా హాంబలే ఫిలిమ్స్ శ్రీమురళీ హీరోగా భగీర అనే సినిమా చేస్తోంది. ఇలా వరుస ఆసక్తికరమైన ప్రాజెక్టులను ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమ వారు కూడా తెరకెక్కిస్తున్నారు.

 గత ఏడాది విడుదలైన చార్లీ 777, కాంతారా వంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు కన్నడ దర్శకులు, మేకర్స్ లైన్లో పెట్టిన ఈ సినిమాలను చూస్తుంటే కచ్చితంగా కన్నడ సినీ పరిశ్రమ ఈ ఏడాది కూడా మంచి హిట్లు అందుకుని దేశవ్యాప్తంగానే కాదు... ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గ్రాస్ దక్కించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. సలార్ సినిమా చేస్తుంటే... పృథ్వీరాజ్ హీరోగా హొంబలే ఫిలిం సంస్థ మరో సినిమా కూడా చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కచ్చితంగా కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచే అవకాశాలున్నాయి. ఒకప్పుడు కన్నడ సినీ పరిశ్రమ మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. కానీ ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమ మీద కూడా అందరూ దృష్టి పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News