బరువులు ఎత్తుతూ సోకులు సూపిస్తోంది

Update: 2016-06-28 06:34 GMT
బాలీవుడ్ భామ కరీనా కపూర్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది. అసలు హిందీ సినిమా ఫీల్డ్ కి ఎక్స్ పోజింగ్ విషయంలో కొత్త పాఠాలు నేర్పించిన స్టేటస్ ఈమెది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అయితే ఆ బికినీలు.. ఆ సోకులు.. ఆ ఎక్స్ పోజింగ్.. ఆ పొట్టి పొట్టి డ్రస్సులు.. అన్నిటికీ మించి జీరోసైజ్ అందాలతో రచ్చ రచ్చ చేసేసింది. కానీ అనుభవం పెరిగాక ఈ డోస్ బాగా తగ్గించేసిన బెబో.. సైఫ్ తో పెళ్లయ్యాక కొన్నాళ్లు బాగా స్లో అయిపోయింది.

రీసెంట్ గా కీ అండ్ కా మూవీలో అర్జున్ కపూర్ కి తెగ ముద్దులు పెట్టేసి.. తను మళ్లీ పాత ట్రాక్ లోకి వస్తున్న విషయాన్ని సూచించిన కరీనా.. ఇప్పుడు ఫుల్ గా ఫాంలోకి వచ్చేసింది. ఫ్యాషన్ మేగజైన్ వోగ్ కు ఫోటో షూట్ చేసిన బెబో.. కవర్ పేజ్ పైకి ఎక్కేసింది. నడుం దగ్గర అంచులు ముడి వేసిన ఓ వైట్ టాప్ తో క్లీవేజ్ ని ఓపెన్ చేసి పోజ్ ఇచ్చేసింది. ఇక మోకాళ్ల పైవరకూ ఫ్రంట్ ఓపెన్ బ్లాక్ బాటమ్ అయితే భలేగా మెరిసిపోతోంది. వీటికి తోడు రెండు డంబెల్స్ ను ఎత్తి పట్టుకుని.. తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంచో కూడా  చెప్పేసింది.

ఈ ఫోటోలో పర్టిక్యులర్ గా మాట్లాడుకోవాల్సిన విషయం.. అమ్మడి నడుం గురించే. మళ్లీ జీరో సైజ్ ట్రై చేస్తోందేమో చెప్పలేం కానీ.. వయ్యారాల నడుమును మరింతగా సన్నగా చేసేసింది. ఈ మేగజైన్ కి ఇంటర్వ్యూలో అయితే.. ప్రియాంక చోప్రాను పొగడియడం విశేషమే. పీసీ మాదిరిగా ఆ స్థాయికి వెళ్లలేనని.. వెళ్లే ప్రయత్నం కూడా చేయలేనని చెప్పేసింది అందాల బెబో.
Tags:    

Similar News