సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ అందరూ స్టార్ కిడ్ ల తరహా లోనే ఎంట్రీ ఇచ్చింది కానీ తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితాన్ని ఆరంభించింది. పెళ్లి తర్వాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టే పాతకాలం నాటి హీరోయిన్ టైపు కాకపోవడంతో పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగించింది. కొడుకు తైమూర్ అలీ ఖాన్ జన్మించిన తర్వాత మాత్రం ఓ రెండేళ్ల పాటు నటనకు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి మునుపటిలాగే హీరోయిన్ గానే కొనసాగుతోంది.
సీనియర్ హీరోయిన్ అయింది కదా అని ఫ్యాషన్ విషయంలో రాజీ పడడం కరీనా ఇంటా వంటా లేదు. నిజానికి ప్రపంచమంతా కరోనా పేరు చెప్తే చాలు వణికిపోతోంది. ఇంట్లో నిముషం పాటు కాలు నిలవని పురుష పుంగవులు సైతం హాలులో కిచెన్ లో.. బాల్కనీ లో.. టెర్రస్ పై తిరుగుతూ అదే ప్రపంచమని సంబరపడుతూ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలే ఇలా ఉన్నప్పుడు కరీనా లాంటి సీనియర్ భామలు మాత్రం తమ ఫ్యాషన్ కు లాక్ డౌన్ ప్రకటించడం లేదు. ఈమధ్య ఈ భామ ప్రఖ్యాత వోగ్ మేగజైన్ కోసం ఒక ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు కరీనా ఇచ్చిన క్యాప్షన్ "నేను కనుక కాలంలో వెనక్కి వెళ్లాల్సి వస్తే నేను చేయని పని ఏది మళ్లీ చేయను".
క్యాప్షన్ ఏదో గజిబిజిగా ఉందని అనుకోవాల్సిన అవసరం లేదు. కరీనా సినీ రంగంలోకి అడుగు పెట్టి ఇప్పటికీ 20 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా వోగ్ మ్యాగజైన్ వారు తమ ఏప్రిల్ ఎడిషన్లో కరీనా కపూర్ పై ఒక కథనం ప్రచురించారు. కవర్ పేజీ ని కరీనా కపూర్ ఫోటోతో అలంకరించారు. ఈ సందర్భంగా గా కరీనా తన కెరీర్ విషయంలో సంతృప్తిగా ఉన్నానని తన అభిప్రాయం వెలిబుచ్చింది. అందుకే కాలంలో వెనక్కి వెళ్లాల్సి వస్తే నేను చేయని పని ఏది చేయను అని చెప్పుకొచ్చింది. ఇక డ్రెస్ విషయానికి వస్తే రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ ఉన్న చోళీ.. లెహంగా.. దుపట్టాతో ట్రెడిషనల్ గానే ఉంటూ హాట్ నెస్ ను ఒలకబోసింది. ఇక కరీనా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అమీర్ ఖాన్ తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా' లో నటిస్తోంది. ఈ సినిమా తో పాటుగా హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అంగ్రేజీ మీడియమ్' లో కూడా నటిస్తోంది.