శేఖర్ కమ్ముల `మద్రాస్` నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ధనుష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తారు. మద్రాసు నుంచి తెలుగు వారు విడిపోయినప్పటి ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఈలోగానే కార్తీ నటించిన `మద్రాస్` విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి 2014లో తమిళంలో విడుదలై ఘన విజయం సాధించిన మద్రాస్ సినిమాను ఇప్పుడు తెలుగులో విడుదల చేయబోతున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు పా రంజిత్ ఈ సినిమాను తెరకెక్కించారు. KE జ్ఞానవేల్ రాజా నిర్మించారు. విమర్శకుల ప్రశంసలే కాదు కమర్షియల్ గానూ విజయం అందుకున్న ఈ సినిమాకి తెలుగు అనువాద పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ లో మద్రాస్ సినిమా ని థియేటర్లలో విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు.
దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అదే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. త్వరలోనే విడుదల తేదీ ని ప్రకటిస్తారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వీలైనంత త్వరగా దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు. కార్తీ- కలైరసన్ హరికృష్ణన్- కేథరిన్ థ్రెసా- రిత్విక తదితరులు నటించారు. ఈ చిత్రానికి పా రంజిత్ కథ- స్క్రీన్ ప్లే అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.