కార్తీ 'స‌ర్దార్' మ‌రో ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్!

Update: 2022-10-18 15:26 GMT
కోలీవుడ్ స్టార్ కార్తీ స్టోరీల ఎంపిక గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కార్తీ ఎంపిక‌లు యూనిక్ గా ఉంటాయి.  వాటిలో కార్తీ పాత్ర సైతం అంతే ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. ఛాలెంజింగ్ రోల్స్ కి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తాడు. కార్తీలో ఉన్న  గొప్ప క్వాలిటీ అది. ముఖ్యంగా కాఫ్ రోల్స్ లో క‌ట్టిపడేయ‌డం ఆయ‌న‌కే చెల్లింది. భారీ క‌టౌట్ కాక‌పోయినా పెర్పార్మెన్స్ తో మెప్పించ‌డం కార్తీ స్టైల్.

తాజాగా `స‌ర్దార్` తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి క్రియేటివ్ మేక‌ర్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మిత్ర‌న్ లాంటి  డైరెక్ట‌ర్ కి కార్తీ లాంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ దొరికితే  పీక్స్ లోనే ఉంటుంది. తాజాగా `సర్దార్` స్టోరీ నెట్టింట సంచ‌ల‌నం రేపుతోంది. ఈ ద్వ‌యం మ‌రోసారి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్టైమెంట్ తెచ్చే స‌బ్జెక్ట్ తో ముందుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈసారి ఏకంగా ఓ రియ‌ల్ స్టోరీనే దించేసిన‌ట్లు క‌నిపిస్తుంది. కొన్ని య‌ధార్ధ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ క‌థ తయారు చేసారు.1980 లో ఇండియ‌న్ ఇంటిలిజెన్స్  దేశం భ‌ద్ర‌త కోసం ఓ గుఢాచారిని త‌యారు చేయాల్సిన అవ‌స‌రం వ‌చ్చింది. అందుకు కేవ‌లం సైన్యంలో ప‌నిచేసిన వారు మాత్రమే ప‌నికొస్తారు. కానీ సైన్యంలో ప‌నిచేసిన వ్య‌క్తిని గుఢచారిగా మార్చ‌డం అంత ఈజీ కాదు.

ధైర్య‌సాహ‌సాలు ఒక్క‌టే గుఢ‌చారి ల‌క్ష‌ణాలు కాదు. అంత‌కు మించి  న‌టించ‌డం  తెలిసి ఉండాలి. ప్ర‌తీ స‌న్నివేశాన్ని అప్ప‌టి ప‌రిస్థిత‌ల్ని  బ‌ట్టి డీల్ చేయ‌గ‌ల‌గాలి. రూపం మార్చుకోగ‌ల‌గాలి. ఆ ర‌కంగా మ‌నిషి రూపం సైతం మారిపోవాలి. వేష‌ధార‌ణ‌తో పాటు.. తెలివిగా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా న‌డ‌చుకోవాలి. కానీ ఇవ‌న్నీ సైనికుడు చేయ‌లేడ‌ని భావిచిన  అప్ప‌టి అధికారులు ఓ రంగ స్థ‌ల న‌టుడ్ని గుఢ‌చారిగా సిద్దం చేసారు.

ఇది నిజంగా వాస్త‌వం. విన‌డానికి ఆశ్చ‌ర్యం క‌లిగించిన న‌మ్మాల్సిన వాస్త‌వం.  స‌రిగ్గా అదే సంఘ‌ట‌న‌ని స్పూర్తిగా తీసుకుని మిత్ర‌న్ `స‌ర్దార్` క‌థ‌ని సిద్దం చేసిన‌ట్లు రివీల్ చేసారు. అంటే కార్తీ  గుఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇలాంటి పాత్ర‌ల్లో కార్తీ ఆద్యంతం మెప్పిస్తాడు. ఆ మ‌ధ్య `ఖాకీ`లో పోలీస్ ఇన్విస్టిగేష‌న్ ఆప‌రేష‌న్ పాత్ర‌తో ఓ రేంజ్ లో ఆక‌ట్టుకున్నాడు. ఈసారి అంత‌కు మించి స‌స్పెన్స్ తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణి స్టూడియోస్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తుంది. అన్ని ప‌నులు పూర్తిచేసి  అక్టోబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News