టాలీవుడ్ లో స్టార్ హీరోలు పారితోషికాలు పెంచేస్తుంటే దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఒక రేంజులో విరుచుకుపడేవారు. అయితే మన హీరోలంతా కెరీర్ లో నాలుగైదు 100 కోట్ల క్లబ్ సినిమాలైనా చేశాక పారితోషికాలు పెంచేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ఒక్క 100 కోట్ల క్లబ్ సినిమాకే ఏకంగా 35-40 కోట్ల పారితోషికం అడిగేస్తున్నాడట. ఆల్మోస్ట్ తన పారితోషికాన్ని డబుల్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
కార్తీక్ ఆర్యన్ నటించిన హారర్ కామెడీ `భూల్ భూలయ్యా 2` దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. అక్షయ్ కుమార్ - విద్యాబాలన్ నటించిన 2007 సైకలాజికల్ హారర్ కామెడీకి సీక్వెల్ తెరకెక్కి అదే పేరుతో మే 20న విడుదలైంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ - కియరా జంటగా నటించారు. కథాంశం విషయానికి వస్తే.... ఠాకూర్ ప్యాలెస్ లో దుష్ట మంజూలిక తిరిగి బయటకు వచ్చాక.. దానిని తరిమేందుకు తీసుకువచ్చిన మోసపూరిత మాంత్రికుడు రుహాన్ కథ ఏంటనేదే సినిమా. అయితే అతను దెయ్యాన్ని తరిమాడా లేదా? అన్నది అటుంచితే అనుకోకుండా సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాడు. ఆపై ఏం జరిగిందన్నది భూల్ భులయా 2లో చూడాలి.
ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి (రూ. 129 కోట్లు) .. కల్ట్ క్లాసిక్ `ది కాశ్మీర్ ఫైల్స్` (రూ. 252 కోట్లు) తర్వాత 100 కోట్ల మార్కును దాటిన మూడవ హిందీ చిత్రంగా కార్తీక్ మూవీ నిలిచింది. ఇప్పటికి ఈ సినిమా మొత్తం రూ.122.69 కోట్లు వసూలు చేసింది.
ఈ చిత్రం విజయవంతమవడంతో బాలీవుడ్ మీడియాలో కార్తీక్ ఆర్యన్ తన తదుపరి చిత్రాలకు ఫీజులను అమాంతం పెంచాడని కథనాలు వండి వారుస్తున్నాయి. ఒక్కో సినిమాకు రూ.15-20 కోట్లు వసూలు చేస్తున్న అతడు ఇప్పుడు ఏకంగా రూ.35-40 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భులయా చిత్రాన్ని భూషణ్ కుమార్ - మురాద్ ఖేతాని నిర్మించారు. ఇందులో టబు- రాజ్‌పాల్ యాదవ్ - సంజయ్ మిశ్రా తదితరులు నటించారు.
ఈ సంవత్సరపు మరపురాని బ్లాక్ బస్టర్ ను అందించినందుకు కార్తీక్ ప్రస్తుతం చాలా మంది విమర్శకులు ప్రేక్షకులచే సూపర్ స్టార్ గా ప్రచారం పొందుతున్నాడు. కెరీర్ పరంగా అతడు ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తదుపరి లైనప్ లో షెహజాదా -కెప్టెన్ ఇండియా-ఫ్రెడ్డీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే సాజిద్ నడియాడ్ వాలా మూవీలోనూ నటించనున్నాడు. ఇవేగాక ఈ ఏడాది మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లతో అభిమానులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే కరణ్ జోహార్ తో వివాదం అనంతరం కార్తీక్ అదిరిపోయే హిట్టు కొట్టడం అతడికి అన్నివిధాలా పాజిటివ్ గా కలిసి రానుంది. సరైన సమయంలో సరైన బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ యంగ్ హీరో మాంచి జోష్ తో ఉన్నాడు.