పలుమార్లు వాయిదాలు పడి మొత్తానికి ఈ శనివారం థియేటర్లో విడుదలవుతున్న కార్తికేయ 2 మంచి హైప్ తోనే ఓపెనింగ్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. 2013లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరుకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ మధ్యలో రెండు మూడు సార్లు వాయిదా పడడంతో కాస్త హడావిడి తగ్గింది.
అయినప్పటికీ చిత్ర యూనిట్ ట్రైలర్తో కొంత హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఎంతవరకు జరిగింది. సక్సెస్ అవ్వాలి అంటే ఎంత రావాలి అనే వివరాల్లోకి వెళితే.. కార్తికేయ 2 సినిమాకు ఉన్న డిమాండ్ ను బట్టి చిత్ర నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ ఫిక్స్ చేసుకున్నారు. దర్శకుడు చందు మండేటి ఈ సినిమాను మిస్టరీ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి తీసుకువచ్చాడు.
తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అని చిత్ర నిర్మాతలు భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా బిజినెస్ వివరాల్లోకి వెళితే నైజంలో 4 కోట్లు, సీడెడ్ లో 2 కోట్లు, ఆంధ్రాలో 6 కోట్లు ధర పలికిన ఈ సినిమా మొత్తంగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో 12 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షలు, ఓవర్సీస్ లో రూ.1 కోటి నలభై లక్షలు వరకు బిజినెస్ చేసింది.
ఇక టోటల్గా చూసుకుంటే కార్తికేయ 2 తెలుగులో 14.20 కోట్ల బిజినెస్ చేయగా 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది. ఇక హిందీలోనే కాకుండా మలయాళం కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
మిగతా భాషల్లో మొత్తంగా 3 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా కార్తికేయ 2 చేసిన బిజినెస్ 17.20 కోట్లు. ఇక ఈ సినిమా సక్సెస్ కావాలి అంటే టోటల్ గా 18 కోట్ల వరకు వెనక్కి తేవాల్సి ఉంటుంది. మరి ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి.