ఈ విక్రమార్కుడు కథలో నుంచి బయటికి రానీయడు

Update: 2021-11-09 06:31 GMT
కార్తికేయ కథానాయకుడిగా 'రాజా విక్రమార్క' సినిమా రూపొందింది. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్తికేయ జోడీగా ఈ సినిమాతోనే తాన్య రవిచంద్రన్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో కార్తికేయ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

'రాజా విక్రమార్క' యాక్షన్ కామెడీతో కూడిన కథ. ఇందులో నేను ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కనిపిస్తాను. యాక్షన్ అనేది చాలా స్టైలీష్ గా ఉంటుంది. ఇంతవరకూ నేను టచ్ చేయని కామెడీ టైమింగ్ తో .. నేను చేయని జోనర్ లో ఈ సినిమా ఉంటుంది. రెండున్నర గంటలపాటు ఈ సినిమా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకుపోతుంది. ఎక్కడా కూడా ప్రేక్షకుడు కథలో నుంచి బయటికి రాడు. ఎంటర్టైన్మెంట్ తో .. నెక్స్ట్ ఏంజరుగుతుంది? అనే ఎగ్జైట్మెంట్ తో ఈ కథ నడుస్తుంది. కావాలని ఎక్కడా ఫైట్లు .. పాటలు .. కామెడీ పెట్టలేదు. కామెడీ కూడా సందర్భానికి తగినట్టుగానే ఉంటుంది.

చాలా స్టైలీష్ గా కామెడీని కలుపుకుంటూ వచ్చిన యాక్షన్ సినిమా ఇది. దర్శకుడు శ్రీ సరిపల్లిపై నమ్మకంతోనే ఈ సినిమా చేశాను. ఆయన కథ చెప్పడం మొదలుపెట్టిన 10 నిమిషాల్లోనే ఆయన ఎంతటి జన్యూన్ పర్సన్ .. హానెస్ట్ పర్సన్ అనేది నాకు అర్థమైపోయింది. సినిమా చూస్తేనే తప్ప ఎలా ఉంటుందనేది చెప్పలేం .. అలాంటి స్క్రిప్ట్ ఇది. ఇలాంటి కథలు వినడానికి చాలా బాగుంటాయి. కానీ ఆ స్థాయిలో గ్రాండ్ విజువల్స్ పడాలి .. ఆర్ ఆర్ కుదరాలి. అప్పుడు స్క్రీన్ పై చూడటానికి బాగుంటుంది. శ్రీ అలాంటి అవుట్ పుట్ తీసుకురాగలడు అనిపించింది.

ఈ సినిమా షూటింగు మొదలుపెట్టిన తరువాత, షెడ్యూల్ .. షెడ్యూల్ కి నాకు నమ్మకం పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకి 'రాజా విక్రమార్క' అనే టైటిల్ పెడదామని నేనే చెప్పాను. అయితే మా డైరెక్టర్ చాలా జన్యూన్ పర్సన్. అలాంటి టైటిల్స్ పెట్టడం వలన సినిమాకి యూజ్ అవుతుందని ఆయన నమ్మడు. ఆయన ఒక రోజంతా ఆలోచించి మన కథకు సరిపోతుంది .. అదే టైటిల్ సెట్ చేద్దాం అన్నాడు. ఎన్.ఐ.ఎ. ఏజెంట్ ఇక్కడికి వచ్చి ఒక మిషన్ మీద ఉన్నప్పుడు తనకి ఎదురయ్యే ఛాలెంజెస్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. పాత్రకి తగినట్టుగా తెరపై కనిపించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News