ఫోటో టాక్‌: ఆ బిగువుల న‌డుమ జిగిబిగి

Update: 2020-01-06 12:51 GMT
అందంగా క‌నిపించ‌డం వేరు. అందాల్ని అంతే అందంగా ఎలివేట్ చేయ‌డం  వేరు. ఈ రెండిటిలో య‌మ సీనియ‌ర్ క‌త్రిన‌. ఇటీవ‌ల ఈ అమ్మ‌డి స్ట‌న్నింగ్ మేకోవ‌ర్ గురించి అభిమానుల్లో నిరంత‌రం చ‌ర్చ సాగుతోంది. ఓవైపు గ్లామ‌ర్ ఎలివేష‌న్ కి మ‌రోవైపు స్టైలిష్ యాక్ష‌న్ తో మెరుపులు మెరిపించ‌డానికి అనువైన విల్లు లాంటి దేహాన్ని మెయింటెయిన్ చేస్తూ క‌త్రిన మ‌త్తెక్కించేస్తోంది.

టైగ‌ర్ జిందా హై.. భార‌త్ లాంటి చిత్రాల్లో క‌త్రిన యాక్ష‌న్ మోడ్ చూసి జ‌నం పిచ్చెక్కిపోయారు. ఇక లుక్ ప‌రంగా నెవ్వ‌ర్ బిఫోర్ ట్రీటిస్తోంది. 34ఏజ్ లోనూ క‌త్రిన రేంజు చూస్తే న‌వ‌త‌రం నటీమ‌ణుల‌కే చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో క‌త్రిన ఫిట్నెస్ క్లాసులకు సంబంధించిన ఫోటోలు వీడియోలు హీటెక్కిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ బీచ్ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ లో త‌న లుక్ ని రివీల్ చేస్తూ క‌త్రిన అభిమానుల‌కు స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చింది.

ఇది రెబెక్కా దీవాన్ ఔట్ ఫిట్. ఆ జాకెట్ పై ప్ర‌త్యేకించి ఎంబ్రాయిడ‌రీ హైలైట్ గా నిలిచింది. ఊదా రంగులో నూడిల్ స్ట్రాప్ లుక్ తో మ‌త్తెక్కిస్తోంది ఆ డ్రెస్. ఇక క‌త్రిన బ్రీజీ లుక్.. స్మైల్ చూస్తుంటే యూత్ కి మతి చెడాలంతే.  ర‌ణ‌బీర్ నుంచి విడిపోయాక గ‌త కొంత‌కాలంగా క‌త్రిన ఒంట‌రిగానే ఉంటోంది. ఏదో త‌న ఆత్మ‌బంధువు.. స్నేహితుడు అయిన‌ స‌ల్మాన్ అండ‌తో కెరీర్ ప‌రంగా తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. కెరీర్ బిజీలో వేరే జ్ఞాప‌కాల్ని మ‌న‌సులోకి రానివ్వ‌కుండా మ‌స‌లుకుంటోంది. అన్న‌ట్టు మొన్న స‌ల్మాన్ భాయ్ బ‌ర్త్ డే వేడుక‌ల్లోనూ క‌త్రిన క‌నిపించింది. అప్ప‌టి లుక్ తో పోలిస్తే ఈ చిలౌట్ లుక్ ఇంకా ఇంప్రెస్సివ్ గా ఉంది.


Tags:    

Similar News