కౌసల్య రాక్షసుడు ఇద్దరూ ఒకే రూటు

Update: 2019-06-19 12:30 GMT
గత ఏడాది కోలీవుడ్ కు బాగా కలిసి వచ్చింది. అధిక శాతం సక్సెస్ లు నమోదు కావడమే కాక రీమేక్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే హక్కులు కొంటున్న మన నిర్మాతలు మాత్రం ఒరిజినల్ వెర్షన్ లోని రీ షూట్ చేయాల్సిన అవసరం లేని సీన్లను వాడుకోవడానికి ముందే అనుమతి తీసుకుని ఇక్కడి ఆర్టిస్టులు హీరో ఉన్న వాటిని మాత్రమే మళ్ళి తీస్తున్నారు. ఇదేమీ కొత్త కాదు కాని గత కొంత కాలంగా ఫాలో అయిన వాళ్ళు తక్కువ.

ఇప్పుడు రెండు సినిమాలు అదే స్ట్రాటజీని వాడుతున్నాయి. ఒకటి కౌసల్య కృష్ణమూర్తి. తమిళ సినిమా కణాలో తండ్రిగా నటించిన సత్యరాజ్ సన్నివేశాలను తెలుగులో రాజేంద్ర ప్రసాద్ తో తీయడం తప్ప మిగిలింది దాదాపు అదే తీసుకున్నారు. శివ కార్తికేయన్ క్యామియోను యధాతధంగా ఉంచేశారు. నిన్న టీజర్ వచ్చాక దీని గురించిన స్పష్టత వచ్చింది

ఇక రెండోది రాక్షసుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన ఈ రీమేక్ లో సైతం ఇదే ఫార్ములా వాడారు. హీరోతో పాటు అనుపమ పరమేశ్వరన్ రాజీవ్ కనకాల సూర్య ఉన్న సీన్లు తప్ప వీళ్ళ అవసరం లేని మిగిలిన ఎపిసోడ్స్ తమిళ్ వే వాడుతున్నారు. అవసరం ఉన్న వాటికి ఆ ఆర్టిస్టులను తీసుకొచ్చి పని పూర్తి చేశారు. దీని వల్ల అవుట్ పుట్ లో పెద్దగా ఏమి కనిపించదు.

తక్కువ గ్యాప్ లోనే తీసిన రీమేక్స్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీని వల్ల నిర్మాతకు బడ్జెట్ పరంగా చాలా హెల్ప్ అవుతుంది. వ్యయంలో పొదుపు జరిగి సేఫ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. టీజర్లతో అంచనాలు పెంచేసిన కౌసల్య కృష్ణమూర్తి-రాక్షసుడు ఒకదాన్ని మించి మరొకటి హిట్ అవుతాయనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు

    

Tags:    

Similar News