లయన్‌ ఆడియో: కృష్ణుడే నాయనా...

Update: 2015-04-09 16:00 GMT
నందమూరి బాలకృష్ణ అంటే ఎవరు? ఆయన ఒక మాస్‌ హీరో. పవర్‌ఫుల్‌ డైలాగులు పేల్చడంలో దిట్ట. మాస్‌పల్స్‌ తెలిసిన కథానాయకుడు. బాక్సాఫీస్‌ను షేక్‌ చేసే స్టార్‌. కాని ఇవన్నీ కాదు, ఆయన ఒక రొమాంటికి కృష్ణుడు అంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటి ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సెలవిచ్చారు.

బాలకృష్ణ అనే పేరులోని ప్రతీ ఒక్క అక్షరానికి చొప్పున ఆయన ఆ అక్షరంతో మొదలయ్యే పేరు కలిగిన ఒక హీరోయిన్‌తో పనిచేశారు.. బి అంటే భానుప్రియతో.. ఎ అంటే అనుష్కతో.. ఎల్‌ అంటే లయతో..  కె అంటే కుష్భూతో.. ఆర్‌ అంటే రోజాతో... ఐ అంటే ఇంద్రజతో.. ఎస్‌ అంటే శ్రీయతో.. హెచ్‌ అంటే హంసానందినితో.. ఎన్‌ అంటే నయనతారతో.. ఎ అంటే ఆర్తి అగర్వాల్‌తో.. బాలయ్య రొమాన్స్‌ చేస్తూ మరి కృష్ణుడు అనిపించకున్నాడు అంటున్నా ఉప ముఖ్యమంత్రి.

నిజానికి పొలిటిక్‌ లీడర్లు ఎక్కువగా పాలిటిక్స్‌తో కూడిన స్పీచ్‌లు ఇస్తారేమో అనుకుంటే.. వీళ్లందరూ ఇలాంటి సినిమ్యాటిక్‌ స్పీచ్‌లో రియల్‌ నందమూరి అభిమానులు అనిపించుకున్నారు.

Tags:    

Similar News