కీర్తి గ్లామ‌ర్ డోస్ పెచేస్తోందా?

Update: 2022-02-12 01:30 GMT
సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `మ‌హాన‌టి` చిత్రంతో తిరుగులేని గుర్తింపుతో పాటు ప్ర‌శంస‌ల్ని జాతీయ పురస్కారాన్ని ద‌క్కించుకుంది కీర్తి సురేష్‌. అయితే ఆ త‌రువాత చేసిన చిత్రాలేవీ ఆమెకు స‌రైన విజ‌యాల్ని అందించ‌లేక‌పోయాయి. కీర్తి చేసిన సీక్వెల్స్ సామి స్క్వేర్ - పందెం కోడి 2  ఎలాంటి ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయాయి. ఇక మహిళా ప్ర‌ధాన చిత్రాలుగా రూపొందిన పెంగ్విన్ - మిస్ ఇండియా.. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీతో క‌లిసి చేసిన `అన్నాత్తే`.. మోహ‌న్ లాల్ తో చేసిన `మ‌ర‌క్కార్‌`.. న‌గేష్ కుకునూర్ `గుడ్ ల‌క్ స‌ఖి` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక పోయాయి.

దీంతో ప్ర‌స్తుతం కీర్తి సురేష్ దృష్టంతా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో క‌లిసి న‌టిస్తున్న `స‌ర్కారు వారి పాట‌`పైనే వుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 ప్ల‌స్ రీల్స్ , జీఎంబీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ప‌ర‌శురామ్ తెర‌కెక్కిస్తున్నారు. `పోకిరి` వైబ్స్ క‌నిపిస్తున్న ఈ మూవీతో త‌న ఇమేజ్ ని మార్చుకోవాల‌ని కీర్తి సురేష్ ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. `మ‌హాన‌టి` త‌రువాత త‌న‌పై సాప్ట్ ఇమేజ్ క్రియేట్ కావడంతో దాన్ని `స‌ర్కారు వారి పాట‌`తో బ్రేక్ చేయాల‌నుకుంటోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ఇందు కోసం గ్లామ‌ర్ డోస్ పెంచబోతున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కీర్తి సురేష్ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో పెద్ద‌గా న‌టించ‌లేదు. స్వామి స్క్వేర్ లో గ్లామ‌ర్ గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేసినా అది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు కానీ తొలిసారి `స‌ర్కారు వారి పాట‌`లో మాత్రం గ్లామ‌ర్ డోస్ పెంచేసి షాకివ్వాబోతోంద‌ట‌. శుక్ర‌వారం ఈ సినిమా కోసం సిద్ శ్రీ‌రామ్ పాడిన `క‌ళావ‌తి` సాంగ్ ప్రోమోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో సారీ ధ‌రించి గ్లామ‌ర్ గా క‌నిపించింది కీర్తి.

అయితే ఈ పాట‌కు సంబంధించిన పూర్తి స్థాయి లిరిక‌ల్ వీడియోని వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ నెల 14న విడుద‌ల చేయ‌బోతున్నారు. అందులో కీర్తి గ్లామర్ డోస్ పెంచేసి న‌టించిందేమో చూడాలి. అదే నిజ‌మైతే కీర్తి అందాల‌తో `స‌ర్కారు వారి పాట‌` మ‌రింత స్పెష‌ల్ గా మార‌డం ఖాయం అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ఇన్ సైడ్ టాక్. 
Tags:    

Similar News