రానా గురించి కీర్తి సురేష్ మ‌న‌సులో మాట‌!

Update: 2022-11-25 16:30 GMT
గాళ్స్ లో  టాలీవుడ్ హంక్ రానా  ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న హైట్..వెయిట్ ..స్టైల్  అన్నింటికి ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. ఈ విష‌యాన్ని  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఓ సందర్భంలో ఒప్పుకున్నారు. టాలీవుడ్ లో ఎంత మంది హీరోలున్నా..అమ్మాయిలంతా రానా ఫోన్  నెంబ‌ర్ అడుగుతార‌ని..అలాంటి అనుభ‌వాలు ఎదురైన వ్య‌క్తిని.. సాక్షిని నేనే అంటూ ప‌బ్లిక్ గానే చెప్పారు.

అదీ గాళ్స్ లో రానా క్రేజ్. మ‌రి హీరోయిన్ల సంగ‌తేంటి? అంటే? అందులోనూ రానా త‌క్కువోడేం కాదు? త‌న‌కు తెలియకుండా చాలా మంది హీరోయిన్ల మ‌న‌సును దోచిన చిలిపి దొంగ‌.

పెళ్లికి ముందు ఓ స్టార్ హీరోయిన్ తో రిలేష‌న్ షిప్ లో ఉన్న‌ట్లు గ‌ట్టిగానే ప్ర‌చారం సాగింది.  వ్య‌వ‌హారం పెళ్లి వ‌ర‌కూ వెళ్తుంద‌ని వెలుగులోకి వ‌చ్చింది. కానీ ఆ బంధం మ‌ధ్య‌లోనే వీగిపోయింద‌ని త‌ర్వాతే అర్ద‌మైంది.

ఆ హీరోయిన్ కూడా రానాని ఎంత‌గానో అభిమానించిన భామే. తాజాగా రానా గురించి కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ త‌న మ‌న‌సులో మాట సైతం బ‌య‌ట పెట్టింది. హ్యాండ్సమ్ హీరో ఎవ‌రంటే?  మ‌రో మాట లేకుండా రానా పేరునే చెప్పింది. అలాగే కూల్ ప‌ర్స‌న్ ఎవ‌ర‌న్నా కూడా రానానే సూచించింది. ఇవ‌న్నీ రానాని క‌ళ్ల ముందు కూర్చోబెట్టుకుని ఠకీ ఠ‌కీ మ‌ని చెప్పేసింది కీర్తి.

దీంతో రానా  షాక్ అయ్యాడు. ఇక నా పేరు చెప్పొద్దూ ప్లీజ్  అంటూ హింట్ ఇచ్చేసాడు. రానా పేరు అమ్మ‌డి నోట వ‌స్తోన్న‌  స‌మ‌యంలో బ్యూటీకి పుల్ల‌కించి పోయింది. న‌వ్వులు పువ్వులు పూయించింది.

ఓ హీరోపై హీరోయిన్ అభిమానమంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. మ‌రి ఈ జోడి ఎప్పుడు జంట‌గా సినిమా చేస్తారో చూడాలి. ప్ర‌స్తుతం రానా స‌రైన క‌థ‌ల కోసం వెయిట్ చేస్తున్నాడు.   'విరాట ప‌ర్వం' త‌ర్వాత కొత్త సినిమాకి సంత‌కం చేయ‌లేదు. బాక్సాఫీస్ ని షేక్ చేసే స‌రైన క‌మ‌ర్శియ‌ల్ స్ర్కిప్ట్ ఒక‌టి చేయాల‌ని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఇంత‌వ‌ర‌కూ అత‌నికి త‌గ్గ ద‌ర్శ‌కుడు దొర‌క‌లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News