'మహానటి' మూవీతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన అందాల భామ కీర్తి సురేష్.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ 'సర్కారు వారి పాట'తో ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
గత కొన్నేళ్ల నుంచి ఫ్లాపులతో సతమతం అవుతున్న కీర్తి సురేష్.. ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ త్వరలోనే లేడీ పోలీస్ గా లాఠీ పట్టబోతోందట. అయితే రియల్ గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ కు 'ఎవరితో నటించాలని కోరుకుంటున్నారు?' అనే ప్రశ్న ఎదురైంది.
అందుకు ఆమె కొందరి హీరోల పేర్లు చెప్పుకొచ్చింది. అయితే కీర్తి సురేష్ నటించాలని కోరుకుంటున్న హీరోల లిస్ట్ లో జయం రవి ఒకరు. ఆ కోరికనే ఇప్పుడు ఆమె తీర్చేసుకోబోతోంది. అవును, తమిళంలో జయం రవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కీర్తి సురేష్ కొట్టేసింది. 'హీరో', 'విశ్వాసం', 'అన్నాత్తే' చిత్రాలకు కథా రచయితగా పని చేసిన ఆంటోని భాగ్యరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు.
అలాగే ఇందులో మరో హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్ కనిపించబోతోంది. ఈ నెల చివర్లో ప్రారంభం కాబోయే ఈ చిత్రాన్ని హోమ్ మీడియా మేకర్స్ సంస్థ నిర్మించనుంది. అయితే ఈ చిత్రంలో కీర్తి సురేష్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా అలరించనున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్రకు మంచి ప్రాధ్యాన్యత ఉంటుందని, నడివి కూడా ఎక్కువే అని అంటున్నారు.
కాగా, కీర్తి సురేష్ తమిళంలో చివరిగా 'సాని కాగితం(తెలుగులో చిన్ని)' అనే చిత్రంలో నటించింది. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రివేంజ్ డ్రామా ఇది. ఇందులో కీర్తి సురేష్ మొదట పోలీస్ పాత్రలో కనిపించింది. ఆ తర్వాత తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిని మట్టు పెట్టే అమ్మాయిగా పూర్తి డీ గ్లామర్ లుక్ లో విశ్వరూపం చూపించింది. ఈ సినిమాలో కీర్తి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సినిమా తర్వాత మళ్లీ జయం రవి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కీర్తి సురేష్ పోలీసు పాత్రలో కనిపించనుంది.
ఇక కీర్తి సురేష్ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే.. తెలుగులో ఆమె న్యాచురల్ స్టార్ నాని సరసన 'దసరా', చిరంజీవికి సోదరిగా 'భోళా శంకర్' చిత్రాలు చేస్తోంది. అలాగే తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా 'మామణిదన్' చిత్రంలోనూ నటిస్తోంది.