చూడ్డానికి ఇన్నోసెంట్ గా కనిపిస్తుంది కానీ... కీర్తి సురేష్ లో చాలా కళలే ఉన్నాయి. ఆమె ఒకొక్క కళని బయటికి తీస్తోంది. `మహానటి`తో మంచి అని నిరూపించుకొన్న కీర్తిలో మంచి డిజైనర్ కూడా ఉందట. ఈమె లండన్ లో స్టైలింగ్ పై ప్రత్యేకంగా కోర్సు కూడా చేసిందట. అందుకే తన సినిమాలకి సంబంధించిన స్టైలింగ్ అంతా దాదాపుగా ఆమే చూసుకొంటూ ఉంటుందట. సినిమాలకి స్టైలిస్ట్ లు పనిచేసినప్పటికీ కీర్తి ఆలోచనలకి అనుగుణంగానే తన కాస్ట్యూమ్స్ డిజైన్ అవుతుంటాయట. తాజాగా ఈమె తనలో ఉన్న మరో కళని బయటికి తీసింది.
అది గాన కళ. తమిళంలో తాను కథానాయికగా నటిస్తున్న `సామి స్క్వేర్` సినిమాలో `పుదు మెట్రో రైల్...` అంటూ సాగే పాటని కీర్తి పాడి అదరగొట్టింది. ఆ పాటలో కీర్తితో పాటు కథానాయకుడు విక్రమ్ కూడా గొంతు కలిపాడు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి స్వరకర్త. స్టార్లతో పాటలు పాడించడంలో దేవిశ్రీప్రసాద్ సిద్ధహస్తుడు. ఆయన ఈసారి కీర్తి - విక్రమ్ లపై దృష్టిపెట్టాడన్నమాట. అయితే ఈ పాట చాలా బాగా వచ్చింది. తమిళనాట జనాల్ని ప్రస్తుతం ఓ ఊపు ఊపేస్తోంది. తెలుగులో ఇప్పటికే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న కీర్తి - ఇక్కడ కూడా పాటలు పాడేస్తుందేమో చూడాలి మరీ!
Full View