`మహానటి` లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సౌత్ లో కీర్తి సురేష్ పేరు మార్మోగింది. ఆ తర్వాత ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలో నటించనుంది అంటూ ప్రచారం సాగిపోయింది. కానీ జక్కన్న మైండ్ లో కీర్తి సురేష్ లేకపోవడంతో ఆ ఛాన్స్ దక్కలేదు. ఆ క్రమంలోనే కీర్తి హిందీ చిత్రపరిశ్రమలో అవకాశం అందిపుచ్చుకుంది. తెలుగులో మాత్రం ఆశించిన పెద్ద రేంజ్ ఛాన్సులేవీ దక్కలేదు.
కీర్తి సురేష్ నటించిన తాజా సినిమా `పెంగ్విన్` ప్రస్తుతం హాట్ టాపిక్. అడవిలో మిస్సయిన తన కొడుకును వెతుక్కునే ఓ గర్భిణి పాత్రలో కీర్తి నటించింది. ఈ సినిమా టీజర్.. ట్రైలర్ రిలీజై ఆకట్టుకున్నాయి. వాస్తవానికి థియేట్రికల్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రస్తుత క్రైసిస్ కారణంగా ఓటీటీ (అమెజాన్ ప్రైమ్) లో రిలీజ్ చేస్తున్నారు. జూన్ 19న తొలి ప్రీమియర్ కి సన్నాహాలు చేస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. బాలల్ని కిడ్నాప్ చేసి ఓ సైకో సాగించే అకృత్యాల కథ. సైకో ఆటను కీర్తి సురేష్ ఎలా కట్టించింది అన్నదే సినిమా కథ. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి నిర్మాత. అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది.
అయితే ఈ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు వెయిట్ చేయకుండా ఓటీటీ రిలీజ్ చేయడానికి కారణమేంటి? అంటే.. ఇలాంటి డార్క్ సినిమాలకు ఓటీటీనే బెస్ట్ అన్న విశ్లేషణ సాగుతోంది. ఈ తరహా జోనర్ ఒక సెక్షన్ ఆడియెన్ కి మాత్రమే చేరువవుతుంది. మల్టీప్లెక్స్ ఆడియెన్ మెచ్చే జోనర్. పైగా మహమ్మారీ క్రైసిస్ లో థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూడడం సరైనది కాదు. క్రైసిస్ ముగిసాక కూడా థియేటర్స్ లో ఆడే ఛాన్స్ లేదు. డార్క్ హారర్ సినిమాలు మల్టీ ప్లెక్సీ ఆడియన్స్ కి మాత్రమే కానీ డౌన్ సెంటర్స్ లో ఇలాంటి సినిమాలు చూడటానికి జనాలు థియేటర్స్ కి రారన్న విశ్లేషణ సాగుతోంది. ఇలాంటి సినిమాలు ఓటిటి లోనే రిలీజ్ చేసుకుంటే బెటర్ అని ట్రేడ్ నిపుణులు కామెంట్ చేస్తున్నారు.