సావిత్రి కదా.. అందరూ పొగుడుతార్లే

Update: 2018-04-26 06:15 GMT
అలనాటి ప్రతిభావంతురాలైన హీరోయిన్ సావిత్రి జీవితంపై రూపొందిన బయోపిక్ మహానటి. కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటించిన ఈ చిత్రంపై ఇండస్ట్రీ అంతా ఆసక్తిగానే ఉంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్లలో.. సావిత్రిని మరిపించే విధంగా ఉన్న కీర్తి సురేష్ గెటప్ అందరినీ ఆకట్టుకుంటోంది. మే నెల 9వ తేదీన మహానటి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేయగా.. ఇప్పుడు మూవీ యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉంది.

 మహానటి చిత్రంలో తన నటనను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తారని తెగ నమ్మకంగా ఉంది కీర్తి సురేష్. అభిమానులు.. ప్రేక్షకులు మాత్రమే కాదు.. ట్రాలింగ్ జనాలకు కూడా ఈ పాత్రతో పాటు తన నటన బాగా నచ్చేస్తుందని అంటోంది. నిజానికి ఈమె చెప్పిన విషయంలో ఇసుమంత కూడా తప్పులేదు. కచ్చితంగా మహానటి సావిత్రిపై సినిమాను అందరూ అభినందిస్తారు. ఆమెకు సరిసాటి అనిపించేంతగా కాకపోయినా.. అంతో ఇంతో సావిత్రిని గుర్తు చేయగలగితే చాలు.. ప్రశంసల వర్షం కురిసిపోతుంది.

ఎలాగూ నటన విషయంలో కీర్తి సురేష్ కు మంచి పేరే ఉంది. ప్రతిభావంతురాలు అనే గుర్తింపు ఉంది. రియల్ లైఫ్ క్యారెక్టర్.. అందులోనూ సావిత్రి లాంటి లెజెండరీ రోల్ ను పోషించిన సమయంలో.. ట్రాలింగ్ సమస్య ఈ సినిమాకు పెద్దగా ఎదురయ్యే అవకాశం లేదు. ఇక సినిమా పరంగా చూస్తే.. సమంత.. విజయ్ దేవరకొండ పాత్రలు కూడా బాగా హైలైట్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News