పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన 'మహానటి'

Update: 2020-04-05 06:58 GMT
గత కొన్ని రోజులుగా మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్ ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో పెళ్ళికి  సిద్ధమవుతోందని - ఇది పెద్దలు కుదిర్చిన సంబంధమిదనే ఓ వార్త మీడియాలో - సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారిన విష‌యం తెలిసిందే. సావిత్రి బయోపిక్ 'మహానటి' చిత్రంలో ఆమె అభినయంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు కీర్తి. ఈ సినిమాలో ఉత్తమ నటన ప్రదర్శించినందుకు గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా అందాల భామ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నదనే ప్రచారం నేషనల్ మీడియాలో ఊపందుకొన్నది. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని కీర్తి సురేష్ చేసుకోబోతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో మంచి ఫార్మ్ లో ఉన్న కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోవడమేంటని అభిమానులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు తన పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ స్పందించింది.

దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌ మాట్లాడుతూ... మీడియాలో గానీ - సోషల్ మీడియాలో గానీ దయచేసి ఇలాంటి వదంతులను స్ప్రెడ్ చేయవద్దని కీర్తి సురేష్ కోరింది. మరో ఏడాది సినిమాలతోనే బిజీగా ఉంటానని - వచ్చే ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చానని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని ప్రశ్నించింది కీర్తి సురేష్. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో - హీరోయిన్లపై రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ప్రతిసారి వీటిపై స్పందించి ఇవన్నీ ఫేక్ న్యూస్.. ఇలాంటి పుకార్లు ఎలా రాస్తారు అని ప్రశ్నిస్తుంటారు సెలబ్రెటీలు. మొన్నటి దాకా అనుష్క పెళ్లి అంటూ రూమర్లు క్రియేట్ చేసిన వారు ఇప్పుడు కీర్తి పెళ్లంటూ మళ్లీ కొత్త రూమర్ తో బయటకి వచ్చారని అర్థమవుతోంది. ఏదేమైనా దీంతో కీర్తి సురేష్ పెళ్లి వార్తలకు ఫుల్‌ స్టాప్ పడిందనే చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాతే' చిత్రంలోను - కార్తీక్ సుబ్బరాజు 'పెంగ్విన్' - మోహన్‌ లాల్ నటిస్తున్న 'మరక్కార్ అరబికదలింటే సింహం' - తెలుగులో 'మిస్ ఇండియా' - గుడ్ లక్ సఖీ - 'రంగ్ దే' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి కాకుండా సూపర్ స్టార్ నెక్స్ట్ సినిమాలో నటించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు.


Tags:    

Similar News