35 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశారట
కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసింది. కాని మళ్లీ అంతటి ప్రతిభ చూపించిన సినిమాగా పెంగ్విన్ ను సినీ వర్గాల వారు పేర్కొంటున్నారు. గర్బవతిగా బాబుకు తల్లిగా కీర్తి సురేష్ ఈ చిత్రంలో కనిపించబోతుంది. థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు ఒక వేళ అయినా కూడా ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేదు. అందుకే పెంగ్విన్ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రేపు ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. పెంగ్విన్ సినిమా విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడిన కీర్తి సురేష్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. దర్శకుడు కథ చెప్పిన సమయంలో చాలా ఎగ్జైట్ అయ్యాను. నాలుగు గంటల్లో కథను వివరించారు. ఆ తర్వాత షూటింగ్‌కు వెళ్లినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా జరిగింది. సినిమా కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేశాం. దర్శకుడు పక్కాగా అనుకున్నది అనుకున్న రోజు పూర్తి చేయడంతో తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం.
ఇప్పటి వరకు నా సినీ కెరీర్ లో ఇంత తక్కువ సమయంలో సినిమాను పూర్తి చేయడం చూడలేదు. ఇక ఈ సినిమాలో నటించిన మాస్క్ మన్ గురించి కీర్తి సురేష్ మాట్లాడుతూ అతి తక్కువ మందికి మాత్రమే ఆయన ఎవరో తెలుసు. ఆయన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని పేర్కొంది. మొత్తానికి పెంగ్విన్ సినిమా తనకు చాలా గొప్ప అనుభూతిని మిగిల్చింది అంటూ పేర్కొంది.