అలా కాలుపై కాలేసుకుని మ‌డ‌తెట్టేస్తోంది!

Update: 2021-12-28 07:30 GMT
న‌టించిన తొలి సినిమాతోనే కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొట్టింది. డ్రీమ్ గాళ్ గా క‌ల‌ల్లో విహ‌రించింది. ఆ వెంట‌నే వ‌రుస చిత్రాల‌కు సంత‌కాలు చేసేసింది. టాలీవుడ్ లోకి సైలెంట్ గా దూసుకొచ్చిన ఈ బ్యూటీ హాట్ గ్లామ్ ఫోటోషూట్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నాయి. ఇంత‌కీ ఎవ‌రీ బ్యూటీ అంటే.. రొమాంటిక్ ఫేం కేతిక శ‌ర్మ‌.

ఆకాష్ పూరి సరసన `రొమాంటిక్` చిత్రంతో కేతిక తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. ముంబై లో మోడల్ గా కెరీర్ ని సాగిస్తున్న కేతిక పూరి ఇచ్చిన ఆఫ‌ర్ ని స‌ద్వినియోగం చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాల్లో చ‌క్క‌ని ఫాలోయింగ్ ఉంది. కేతిక శ‌ర్మ మోడ‌ల్ గా.. టీవీ న‌టిగా సుప‌రిచితం. కేతిక‌ ఇన్ స్టాగ్రమ్ లో స్పీడ్ గానే ఉంది. నిరంతరం సోష‌ల్ మీడియాల్లో కొత్త ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తూ అభిమానుల‌ను పెంచుకుంటోంది. కేతిక‌ `కిచెన్ డైరీస్` పేరుతో కాన్సెప్ట్ బేస్డ్ ఫోటోషూట్ లు వైరల్ అయ్యాయి. ఇక రొమాంటిక్ చిత్రంలో కేతిక అందాల ఆర‌బోత న‌ట‌న‌కు కాంప్లిమెంట్లు ద‌క్కాయి. డెబ్యూ న‌టి అయినా ఎలాంటి బెరుకు లేకుండా అమ్మ‌డు రొమాన్స్ ని అద‌ర‌గొట్టింద‌ని కితాబు ఇచ్చేసింది యూత్. డెబ్యూ మూవీ రొమాంటిక్ ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోయినా టాలీవుడ్ లో కేతిక‌కు ఇది ర‌హ‌దారి అయ్యింద‌నే చెప్పాలి.

ప‌లు క్రేజీ ఆఫ‌ర్లు త‌న‌ని వ‌రించాయి. తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ కేతిక‌కు అవ‌కాశాలొస్తున్నాయి. నాగ శౌర్య స‌ర‌స‌న ల‌క్ష్య‌ చిత్రంలో కేతిక న‌టిస్తోంది. ఇంత‌కుముందు శౌర్య-కేతిక‌ జంట‌ పోస్ట‌ర్ అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. యంగ్ డిల్లీ బ్యూటీ కేతిక‌ తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో త‌నదైన యాటిట్యూడ్ ని చూపించింది. థై-థండ‌ర్ షోస్ తో అద‌రగొట్టింది. అలా కాలుపై కాలేసుకుని మ‌డ‌తెట్టేస్తోందంటూ కితాబు అందుకుంటోంది. పూర్తి రిలాక్స్ మోడ్ లో ఉన్న కేతిక ఫ్రూట్ జ్యూస్ సేవిస్తూ ఎంతో ప్లెజెంట్ గా క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News