బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ సింగ్ పీఆర్ మేనేజర్ గా పనిచేసిన సిద్ధార్థ్ పితాని ను ఎన్సీబీ అధికారులు ఈరోజు శుక్రవారం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గతంలో సుశాంత్ తో పాటు అతని ఫ్లాట్ లో ఉన్న సిద్దార్ద్ పితానీని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గతేడాది జూన్ 14 ముంబైలోని తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకొని మరణించారు. సుశాంత్ స్నేహితుడైన సిద్దార్ధ్ బాంద్రా ఫ్లాట్ లో అతనితో పాటు మూడేళ్ల పాటు ఉన్నాడని తెలుస్తోంది. ఈ కేసులో సిద్దార్ధ్ ను ఇప్పటికే సీబీఐ, నార్కో కంట్రోల్ బ్యూరో అధికారులు పలుమార్లు విచారించారు. యువ హీరో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చివరిసారిగా సిద్దార్ధ్ తో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో తాజాగా సిద్ధార్థ్ ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది.
సిద్ధార్థ్ పితాని అరెస్ట్ ను ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ హెడ్ సమీర్ వాంఖడే ధృవీకరించారు. సిద్ధార్థ్ ను అరెస్టు చేశామని.. త్వరలోనే కోర్టులో అతని హాజరు పరుస్తామని అన్నారు. ఇకపోతే సుశాంత్ సింగ్ మృతి కేసులో ఆ కుటుంబం తరపున వాదిస్తున్న లాయర్ వికాస్ సింగ్ కూడా సిద్దార్ధ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని గతంలో పేర్కొన్నారు.