కన్నడంలో తెరకెక్కి ఇండియా వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా 200 కోట్లను రాబట్టిన ఈ సినిమా త్వరలో పాకిస్తాన్ కు వెళ్లబోతుంది. లాహోర్ మరియు ఇష్లామాబాద్ ల్లో ఈ సినిమాను పలు మల్టీప్లెక్స్ లలో విడుదల చేయబోతున్నారు. హిందీ వర్షన్ ఇప్పటికే నార్త్ లో మంచి వసూళ్లను రాబట్టిన కారణంగా పాక్ లో కూడా తప్పకుండా ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కన్నడలో 80 కోట్ల బడ్జెట్ తో నిర్మితం అయిన ఈ సినిమా కు ప్రశాంత్ నిల్ దర్శకత్వం వహించాడు. సినిమా కు బాహుబలి రేంజ్ సినిమా అంటూ పబ్లిసిటీ రావడంతోపాటు, అన్ని భాషల్లో కూడా ఈ సినిమా మంచి టైం కు విడుదల అయ్యింది. ఆ కారణంగా సినిమా సునాయాసంగా 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంకా కూడా ఈ సినిమా మరింతగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండవ పార్ట్ కు అప్పుడే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.