విశ్వక్‌ సేన్‌ సినిమాకి కేజీయఫ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌

Update: 2022-06-22 10:30 GMT
ఈ నగరానికి ఏమైంది. ఫలక్‌నుమా దాస్, పాగల్, అశోక వనంలో అర్జున కల్యాణం వంటి సినిమాలతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన యువకిరణం విశ్వక్‌ సేన్‌ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. అశోక వనంలో అర్జున కల్యాణం మూవీ సక్సెస్ సంబురాలను ఎంజాయ్ చేసే టైం కూడా లేకుండా తన నెక్స్ట్‌ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఓవైపు నాలుగైదు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. మరోవైపు తన 11వ సినిమా అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు విశ్వక్ సేన్. యాక్షిన్ కింగ్‌ అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. అందేంటంటే..

ఫలక్‌నుమా దాస్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మాస్ కా దాస్ అనే టైటిల్‌ను సొంతం చేసుకున్న విశ్వక్‌ సేన్ కొద్దికాలంలోనే టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. తన సినిమాలతోనే కాకుండా.. తన ఆటిట్యూడ్‌తో ఓ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్ చేసుకున్న విశ్వక్‌ సేన్‌ తన జానర్‌కు భిన్నంగా అశోక వనంలో అర్జున కల్యాణం అనే సినిమాతో ఇటీవలే మన ముందుకొచ్చారు. ఆ సినిమాలో తన నటనతో ఇటు యూత్‌నే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కూ దగ్గరయ్యారు. 

అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా తర్వాత విశ్వక్ సేన్ తన తదుపరి సినిమా ప్రకటించారు. కన్నడ స్టార్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాను అర్జున్ డైరెక్ట్ చేయడమే కాదు నిర్మాత కూడా ఆయనే. కథ కూడా అర్జునే అందించడంతో ఈ మూవీపై ఇటు విశ్వక్ ఫ్యాన్స్‌లో.. అటు అర్జున్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ కూడా నటిస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్‌ విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌లో ఈ మూవీపై మరింత హైప్‌ని క్రియేట్ చేస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా కేజీయఫ్ సంగీత దర్శకుడు రవి బసృర్‌ను ఎంచుకున్నారు. ఆల్రెడీ విశ్వక్ సేన్, అర్జున్ సర్జాలతో ఈ సినిమా రేంజ్ పెరిగింది. ఇప్పుడు ఈ మూవీ కోసం ఏకంగా కేజీయఫ్ మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. 

అశోక వనంలో అర్జున కల్యాణం తర్వాత విశ్వక్ సేన్ నాలుగైదు చిత్రాలు ప్రకటించారు. అందులో ఒకటి పాగల్ డైరెక్టర్ నరేశ్‌ దర్శకత్వంలో ‘ధమ్కి’ అనే సినిమా. ప్రసన్న కుమార్ బెజవాడ కథతో ముహూర్తం జరుపుకున్న ఈ సినిమాకి వారం తిరగకుండానే డైరెక్టర్ పేరు మారింది. నరేశ్‌ ప్లేస్‌లో విశ్వక్ దర్శకత్వ బాధ్యతను తీసుకోవడంతో ఫ్యాన్స్‌లో ఈ సినిమాపైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. 

ఇవే కాకుండా విశ్వక్ సేన్ ఇంకా... ‘గామి, అక్టోబర్ 31 లేడీస్ నైట్, ఓరి దేవుడా, దాస్ కా దమ్కీ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. వీటిలో కొన్ని చిత్రీకరణ పూర్తి చేసుకుని ఫ్యాన్స్‌ని ఖుష్ చేయడానికి రెడీగా ఉన్నాయి. మిగతా సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ విశ్వక్ సేన్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్నప్పుడే తన 11వ సినిమా అర్జున్ సర్జాతో చేస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కి సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు ఈ మాస్ కా దాస్.. విశ్వక్ సేన్.
Tags:    

Similar News