బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ - సీమా ఖాన్ జంట విడాకుల వార్తలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్భాజ్ ఖాన్ తర్వాత సోహైల్ ఖాన్ విడాకులు సల్మాన్ కుటుంబంలో ఒక పెద్ద కుదుపు. ఇటీవలే విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేసిన తర్వాతా సీమా ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో తన పేరును మార్చుకున్నారు. సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ నుంచి సీమా కిరణ్ సజ్దే విడిపోతున్నట్టు బహిరంగంగా వెల్లడించారు. సీమా గత ఐదేళ్లుగా సోహైల్ నుంచి దూరంగా ఉంటున్నారు. దీనిపై ప్రశ్నించగా ''మా అభిప్రాయాలు ఒకేలా లేవు'' అని ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సీమా సజ్దేవ్ ఈ బ్రేకప్ గురించి ఎంతమాత్రం చింతించడం లేద(రిగ్రెట్ ఫీలవ్వడం లేద)ని కూడా ఇదివరకూ వ్యాఖ్యానించింది.
సీమా ఎప్పటిలానే బికినీ బీచ్ వెకేషన్స్ విదేశీ విహారాలతో జాయ్ ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. తాజా వెకేషన్ లో సీమా బికినీలో అద్భుతంగా కనిపించింది. రిసార్ట్ ఈవెనింగ్స్.. డిన్నర్ టైమ్.. డ్రింక్ టైమ్ నుండి వరుస ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ''తెల్ల కమలం ఫీలవుతోంది.. లేదు నేను చనిపోలేదు!'' అంటూ ఈ ఫోటోకి నిగూఢమైన క్యాప్షన్ ని సీమా ఇచ్చింది.
నటుడు-నిర్మాత సోహైల్ ఖాన్ ఇటీవల ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో సీమా ఖాన్ తో కనిపించడంతో వార్తల్లో నిలిచారు. 1998లో పెళ్లి చేసుకున్న సోహైల్- సీమా ఇటీల విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.అనంతరం సీమా తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో తన పేరును మార్చుకుంది.
ఆమె తన పేరు నుండి ఖాన్ ని తొలగించింది. ఆమె పేరు ఇప్పుడు ''సీమా కిరణ్ సజ్దే'' అని ఉంది. సీమా ముంబై ఇండస్ట్రీలో బిగ్ సెలబ్రిటీ. నెట్ ఫ్లిక్స్ షో ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ లో తాము విడివిడిగా జీవిస్తున్న సీమా వెల్లడించారు.
నలుగురు స్టార్ వైఫ్స్ - సీమా ఖాన్- మహీప్ కపూర్ (సంజయ్ కపూర్ భార్య)- భావనా పాండే (చుంకీ పాండే భార్య)-నీలం కొఠారి (సమీర్ సోనీ భార్య) జీవితాల ఆధారంగా రూపొందించిన ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ అనే హిట్ షో విజయవంతమైంది. ఈ షోను కరణ్ జోహార్ నిర్మించారు. షో మొదటి ఎపిసోడ్ లో సోహైల్ తో తన సంబంధం గురించి వారు వేర్వేరు ఇళ్లలో ఎలా జీవిస్తున్నారనే దాని గురించి సీమా స్వయంగా మాట్లాడారు.
సోహైల్ ను తాను ఎప్పుడూ ప్రేమిస్తానని అతను చాలా అద్భుతమైన తండ్రి అని ఆమె చెప్పింది. నేను అతనిని ప్రేమిస్తున్నాను.. నేను ఎల్లప్పుడూ అతనితో స్నేహం చేస్తాను. మా మధ్య మంచి సంబంధం ఉంటుంది. కొన్నిసార్లు మనం పెద్దయ్యాక సంబంధాలు వంకరగా మారతాయి.. వేర్వేరు దిశల్లోకి వెళ్తాయి. మేము సంతోషంగా ఉన్నాము. నా పిల్లలు సంతోషంగా ఉన్నందున నేను దాని గురించి క్షమాపణలు చెప్పను అని తెలిపింది.
సోహైల్ నేను సంప్రదాయ వివాహం చేసుకోలేదు..కానీ మేము ఒక కుటుంబం. మేము ఒక యూనిట్. మాకు అతను నేను .. మా పిల్లలు రోజు చివరిలో సంతోషంగా ఉండడం ముఖ్యం అని సీమా అన్నారు. సోహైల్ సీమా పరస్పర స్నేహితుల ద్వారా కలుసుకున్నారు. మంచి స్నేహితులు అయ్యారు. ప్రేమలో పడి ఏడాదిలోపే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సీమా కుటుంబం మొదట్లో ఈ పెళ్లిపై విముఖత చూపగా ఆ తర్వాత దాన్ని ఆమోదించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.