టీజర్ టాక్: భీమిలి బీచ్ రోడ్ పక్కన శవం

Update: 2019-03-26 15:19 GMT
తమిళ హీరో విజయ్ అంటోనీ.. యాక్షన్ కింగ్ అర్జున్.. అషిమ నర్వాల్  ప్రధాన పాత్రలలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'కిల్లర్'.  ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన స్నీక్ పీక్  ఈరోజే విడుదలయింది.  రెండు నిముషాలకు పైగా ఉండే ఈ టీజర్ అంతా ఒక శవం చుట్టూ తిరుగుతుంది.  ఈ సినిమాలో హంతకుడిగా విజయ్ ఆంటోనీ నటిస్తే.. హత్యకేసును విచారణ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ నటించాడు.

టీజర్ ఆరంభంలోనే పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక ఫోన్ వస్తుంది. "భీమిలి బీచ్ రోడ్ నుంచి మాట్లాడుతున్నానయ్యా.. రోడ్ పక్కన ఖాళీ స్థలం ఉంది కదా.. అందులో శవం పడుందయ్యా" అంటూ ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు.  ఆ తర్వాత అసలు గుర్తు పట్టేలా లేని ఒక శవాన్ని చూపిస్తారు. పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఫోటోలు తీస్తుంటారు.  ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ "క్రౌడ్ లోపలికి రాలేదు కదా?" అని అడుగుతాడు. అతను సమాధానం ఇచ్చిన తర్వాత అంబులెన్స్.. డాగ్ స్క్వాడ్ కు చెప్పారా అని అడుగుతాడు. వారు దారిలో ఉన్నారని చెప్తాడు. ఇక డెడ్ బాడీని పరిశీలించే సమయంలో కట్ షాట్స్ లో విజయ్ అంటోనీ ని చూపించారు. ఒక రూమ్ లో కూర్చోని సిగరెట్ కాలుస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. రాయితో ఒకరి తలను నుజ్జునుజ్జు చేయడం.. తర్వాత పెట్రోల్ పోసి బాడీని మంట పెట్టడం చూపించారు. కానీ అలా చేసింది ఎవరని చూపించలేదు.

సినిమా టీజర్ రియలిస్టిక్ గా కొంచెం తమిళ స్టైల్లో ఉంది. శవాన్ని అర్జున్ నిశితంగా పరిశీలించే సమయంలో ఒక పెన్ తో ప్యాంట్ కున్న టైలర్ స్టికర్ ను తీయడం అలాంటి షాటే.  ఓవరాల్ గా స్నీక్ పీక్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ పర్ఫెక్ట్.  థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చేలానే ఉంది.  విజయ్ అంటోనీతో పాటుగా అర్జున్ కూడా కీలక పాత్ర పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచేదే. ఆలస్యం ఎందుకు.. 'కిల్లర్' ను చూసేయండి.


Full View

Tags:    

Similar News