కింగ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ స్టార్ట‌య్యేది అప్పుడేనా!

Update: 2023-02-22 08:00 GMT
టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో చిరు, బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఇప్ప‌టికే వెంక‌టేష్ 75వ‌ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ గా `సైంధ‌వ్‌`ని ఇటీవ‌లే మొద‌లు పెట్టిన విష‌యం తెలిసిందే. హిట్ సిరీస్ ల ఫేమ్ శైలేష్ కొల‌ను ఈ మూవీని రూపొందిస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లే `వాల్తేరు వీర‌య్య‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఫామ్ లోకి వ‌చ్చేశాడు. ఇదే త‌ర‌హాలో నంద‌మూరి బాల‌కృష్ఱ కూడా `వీర సింహారెడ్డి`తో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

చిరు `భోళాశంక‌ర్‌`తో బిజీగా వుండ‌గా, బాల‌య్య .. అనిల్ రావిపూడితో త‌న 108వ ప్రాజెక్ట్ లో న‌టిస్తున్నాడు.  వీరి త‌ర‌హాలోనే మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని కింగ్ నాగార్జున ప్లాన్ చేసుకుంటున్నారు. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న నాగార్జున ఈ సారి గ‌ట్టిగా కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో స‌రికొత్త క‌థ‌లతో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా త‌న 99వ సినిమాని రైట‌ర్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ప్ర‌స‌న్న కుమార్‌ బెజ‌వాడ‌తో చేయ‌బోతున్నాడు.

దీని కోసం మ‌ల‌యాళ రీమేక్ ని న‌మ్ముకున్నార‌ట‌. 99వ సినిమాగా మ‌ల‌యాళ మూవీ `పెరింజు మ‌రియ‌మ్ జోస్‌` ని రీమేక్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యింద‌ని, ఇందులో అల్ల‌రి న‌రేష్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌నుండ‌గా, రాజ్ త‌రుణ్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంద‌ని, త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని తెలిసింది.

ఇదిలా వుంటే కింగ్ నాగార్జున ప్రెస్టీజియ‌స్ గా భావిస్తున్న 100వ ప్రాజెక్ట్ ని మోహ‌న్ రాజాతో చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే స్క్రిస్ట్ ని ఫైన‌ల్ చేసిన నాగార్జున త్ర‌వ‌లోనే దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ని కూడా విడుద‌ల చేయ‌బోతున్నార‌ని తెలిసింది. మ‌రి కొన్ని రోజుల్లో మోహ‌న్ రాజా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ ని రెడీ చేసి నాగార్జున‌ని క‌ల‌వ‌బోతున్నార‌ని, ఇందులో అఖిల్ కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలిసింది. ఇదిలా వుంటే నాగ్ ప్రెస్టీజియ‌స్ గా భావిస్తున్న ఈ ప్రాజెక్ట్ ని 2024 ప్రధ‌మార్థంలో సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నార‌ని తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News