25 ఏళ్ళ శంకర్ కోసం దిగ్గజాలు కలిశారు

Update: 2019-04-22 08:09 GMT
శంకర్. ఈ పేరు వింటేనే యువతరం దర్శకులకు ఓ వైబ్రేషన్. పాతికేళ్ల క్రితం అర్జున్ హీరోగా జెంటిల్ మెన్ అనే సినిమా తీసినప్పుడు మొదట ట్రైలర్ చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఓ తమిళ సినిమాని హాలీవుడ్ స్టాండర్డ్ లో తీయవచ్చా అని ఆశ్చర్యపోయారు. సినిమా చూసాక మతులు పోవడం ఒక్కటే తక్కువయ్యేది. సందేశం ఇస్తూనే కమర్షియల్ అంశాలు అన్నింటిని జోడించిన తీరు ఏకంగా చిరంజీవినే మెప్పించి హిందీలో రీమేక్ చేసుకునేలా ప్రేరేపించింది.

తర్వాత ప్రేమికుడు ప్రభుదేవాను ఏ స్థాయికు తీసుకెళ్ళిందో అందరికీ గుర్తే. కమల్ హాసన్ భారతీయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అర్జున్ తో రెండోసారి తీసిన ఒకే ఒక్కడులో వ్యవస్థను ప్రశ్నించిన తీరుని చూసి క్రిటిక్స్ పొగడ్తలకు మాటల కోసం వెతుకున్నారు. ఇక అపరిచితుడు తమిళ్ లో కంటే తెలుగులోనే బ్లాక్ బస్టర్ ఇక శివాజీ-రోబో-ఐ-2.0 ఇలా చెప్పుకుంటూ పేజీలు తరిగిపోతాయి కానీ మ్యాటర్ అయిపోదు.

అలాంటి శంకర్ ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్ళు పూర్తయిన సందర్భంగా కోలీవుడ్ ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన కృతజ్ఞతతో తమిళ దిగ్గజ దర్శకులందరూ ప్రత్యేకంగా రీ యూనియన్ మీట్ పేరుతో శంకర్ తో కలిసి బ్లూ అండ్ బ్లూ యునిఫార్మ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు.

ప్రధాన ఆకర్షణగా మణిరత్నం-గౌతం మీనన్ లాంటి మాస్టర్ డైరెక్టర్స్ తో పాటు ఆత్లీ లాంటి అప్ కమింగ్ యంగ్ జనరేషన్ కూడా అందులో ఉన్నారు. దీని తాలుకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ 2 పనుల్లో బిజీగా ఉన్న శంకర్ తర్వాత చిరంజీవితో చేసే అవకాశాల గురించి ఇప్పటికే ప్రచారం మొదలైపోయింది
Tags:    

Similar News