రోజుకో కొత్త ప్రేమకథ పుట్టుకొస్తున్నట్టే సినిమాల్లోనూ కొత్త తరహా లవ్ స్టోరీస్ తెరపైకొస్తున్నాయి. వినూత్నమైన కథలతో సరికొత్త పంథాలో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రేమకథ `కొత్త కొత్తగా..` పేరుతో రాబోతోంది. ఈ మూవీ ద్వారా అజయ్, వీర్తి వఘానీ హీరో హీరోయిన్ లుగా పరిచయం అవుతున్నారు. హనుమాన్ వాసం శెట్టి దర్శకుడు. ఫన్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బి.జి. గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర ఈ మూవీని నిర్మించారు.
విబిన్నమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీని సెప్టెంబర్ 9న థియేటర్లలో రిలీజ్ చేసక్తున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. టెన్ డేస్ లో పెళ్లి..వీలైతే వాడేసుకో..అనే అమ్మాయికి ప్రేమే ప్రాణంగా భావించే అబ్బాయికి మధ్య సాగే సరికొత్త ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు.
`రాజీ అంటే కాంప్రమైజ్ కాదు..రాజ రాజేశ్వరీ దేవి.. తనొక ఐటమ్ రా.. ఫీలింగ్స్ వుండవ్.. ఏంటీ సిద్దు మొంహంలో నవ్వు.. చేతిలో పువ్వు..లవ్వా..
దాన్నే ప్రేమనుకుంటే ఎలా చెప్పు.. అంటూ హీరోయిన్ చెబుతున్న డైలాగ్ లు సినిమా కథేంటో చెప్పేస్తున్నాయి. `ఆర్ ఎక్స్ 100` సినిమాలోని హీరోయిన్ పాత్రని గుర్తు చేసే పాత్రలో హీరోయిన్ క్యారెక్టర్ హీరోని కేవలం తన కోరిక తీర్చడం కోసమే వెంట తిప్పుకుని ఆ తరువాత హ్యాండిచ్చే అమ్మాయిగా కనిపిస్తోంది. ట్రైలర్ లో ఇదే స్పష్టం తెలుస్తోంది.
ప్రేమ అంటే కోరిక అని, టెన్ డేస్ లో నా పెళ్లి.. వీలైతే నన్ను వాడేసుకో.. అనే ఓ యువతి కారణంగా తనని ప్రేమించి వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి ఎలా సుఖాంతమైంది అన్నదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సిద్ శ్రీరామ్ ఆలపించిన `ఈ జన్మ ఇంకెందుకే...` అంటూ సాగే సాంగ్ హైలైట్ గా నిలవనుంది.
Full View