అరవోళ్ల భాషా దురభిమానం గురించి మనం జోకులేసుకుంటాం కానీ.. మన భాషను ఏమాత్రం కాపాడుకుంటున్నాం అని ఒక్కసారి ఆలోచించుకోవాలి. తమిళంలో టైటిళ్లు పెడితే సినిమాలకు పూర్తిగా పన్ను మినహాయింపే ఇచ్చే విధానాన్ని కొన్నేళ్ల పాటు కొనసాగించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ మెలిక కూడా పెట్టిందనుకోండి. అయినా కూడా ఈ తమిళ టైటిళ్ల కల్చర్.. అక్కడ భాషాభివృద్ధికి ఎంతో కొంత తోడ్పడుతోందన్నది వాస్తవం.
కానీ మన దగ్గర మాత్రం అలాంటి నిబంధనలేమీ లేవు. మన రచయితలు - దర్శకులకు తెలుగు టైటిళ్ల పట్టింపు ఉండదు. తెలుగులో పేర్లు పెట్టేస్తే భాష బతికేస్తుందా అని వితండవాదం చేస్తే ఏం చేయలేం. ఐతే కొందరు మాత్రం యాదృచ్ఛికంగానో, ఉద్దేశపూర్వకంగానో తమ సినిమాలకు తెలుగు టైటిళ్లే పెడతారు. ఇప్పుడున్న దర్శకుల్లో తెలుగు టైటిళ్లే పెట్టేవాళ్లలో క్రిష్ - శ్రీకాంత్ అడ్డాల ముందుంటారు.
గమ్యం - వేదం - కృష్ణం వందే జగద్గురుం - కంచె లాంటి మంచి టైటిళ్లు పెట్టాడు క్రిష్. కొత్త బంగారు లోకం - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - ముకుంద - బ్రహ్మోత్సవం.. ఇలాంటి అందమైన టైటిళ్లతో ఆకట్టుకుంటున్నాడు శ్రీకాంత్. ఇలాంటి దర్శకులు మరికొంతమంది ఉన్నారు. కృష్ణవంశీ కూడా ప్రతి సినిమాకూ అచ్చతెలుగు టైటిళ్ల కోసం ప్రయత్నిస్తుంటాడు. ‘డేంజర్’ మినహాయిస్తే ఆయన టైటిళ్లన్నీ తెలుగువే. ఐతే ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లు మాత్రం అచ్చ తెలుగు టైటిళ్ల మీద అంతగా దృష్టిపెట్టట్లేదు.