అమితాబ్ కాదంటే.. ఆయనేనట

Update: 2017-01-22 06:35 GMT
నయనతార లేకుంటే ‘శ్రీరామరాజ్యం’ లేదన్నాడు గతంలో బాలకృష్ణ. అలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి సంబందించి అలాంటి క్రెడిట్ హేమమాలినికి ఇచ్చాడు. తన తర్వాతి సినిమా ‘రైతు’ విషయంలోనూ బాలయ్య ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు. ఇందులో ఒక కీలక పాత్రకు అమితాబ్ బచ్చన్ ను అడిగామని.. ఆయన ఓకే అంటే సినిమా ఉంటుందని.. లేదంటే లేదని ఆయన స్పష్టం చేశారు. ఐతే అమితాబ్ మాత్రం ఈ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదు. ‘సర్కార్-3’ పూర్తయ్యాక చెబుతానని అమితాబ్ అన్నారట. ఆయన రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అమితాబ్ విషయంలో బాలయ్య అంత పట్టుదలగా ఉన్నాడు కానీ.. దర్శకుడు కృష్ణవంశీ ఆలోచన మాత్రం మరోలా ఉందట.

అమితాబ్ ఈ పాత్రకు ఒప్పుకోని పక్షంలో కృష్ణవంశీ మరో ఛాయిస్ కూడా చూసుకున్నాడట. సీనియర్ నటుడు కృష్ణం రాజుతో ఆ పాత్ర చేయించాలన్నది కేవీ ఆలోచన. కృష్ణం రాజు ఆ పాత్రకు బాగానే సరిపోతారని కృష్ణవంశీ భావిస్తున్నాడట కానీ.. బాలయ్య మాత్రం అమితాబ్ విషయంలోనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఐతే అమితాబ్ కాదన్న పక్షంలో కృష్ణంరాజుతోనే ఆ పాత్ర చేయించడానికి బాలయ్యను ఎలాగైనా ఒప్పించాలని కృష్ణవంశీ పట్టుదలతో ఉన్నాడు. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేయడానికి అతను సిద్ధంగా లేడు. స్క్రిప్టు అంత బాగా ఉన్నపుడు ఒక నటుడి విషయంలో రాజీ పడలేక సినిమాను ఆపేయడం సబబు కాదని కృష్ణవంశీ భావిస్తున్నాడు. మరి అమితాబ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో.. బాలయ్య ఈ ప్రాజెక్టుపై ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News