యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం ''కృష్ణ వ్రింద విహారి''. ఇదొక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీతో అందాల భామ షిర్లీ సెటియా హీరోయిన్ బుగా టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషషన్స్ జోరుగా సాగుతున్నాయి.
KVV సినిమా పాటలు మరియు టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు తాజాగా మేకర్స్ 'కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.
'గుడు గుడు గుంజం గోవిందా.. టార్చర్ ఇట్లా ఉంటుందా.. నేనే పడ్డా ఈ గొయ్యీ.. నా కోసం నేను తవ్విందా.. కృష్ణ వ్రిందా విహారీ.. ఏదీ దారీ..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. సినిమాలో నాగశౌర్య పాత్రకు వచ్చిన చిక్కులు - ఇబ్బందుల గురించి ఈ పాట తెలియజేస్తుంది.
మహతి స్వర సాగర్ 'కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ కు మంచి ట్యూన్ ని సమకూర్చారు. గేయ రచయిత కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా.. గాయకుడు రామ్ మిరియాల తనదైన వాయిస్ తో ఎంతో హుషారుగా ఈ పాటను ఆలపించాడు.
ఈ సినిమాలో కృష్ణ అనే బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించాడు. ఒక మోడ్రన్ యువతిని ప్రేమించిన తర్వాత అతని లైఫ్ లో ఏమేమి జరిగాయి.. ఆ అమ్మాయి మరియు ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నాడు అనేది ఈ పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేసారు.
ఇందులో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించగా.. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - సత్య - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.
'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మల్పూరి నిర్మించారు. సెప్టెంబర్ 23న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా KVV టీమ్ ఈరోజు బుధవారం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుపతి లో అలిపిరి మెట్టు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ రోడ్ షో చేశారు. రేపటి నుంచి నెల్లూరు - ఒంగోలు - విజయవాడ - గుంటూరు - ఏలూరు - భీమవరం - రాజమండ్రి - కాకినాడ - వైజాగ్ లలో నాగశౌర్య అండ్ టీమ్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
KVV సినిమా పాటలు మరియు టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు తాజాగా మేకర్స్ 'కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.
'గుడు గుడు గుంజం గోవిందా.. టార్చర్ ఇట్లా ఉంటుందా.. నేనే పడ్డా ఈ గొయ్యీ.. నా కోసం నేను తవ్విందా.. కృష్ణ వ్రిందా విహారీ.. ఏదీ దారీ..' అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. సినిమాలో నాగశౌర్య పాత్రకు వచ్చిన చిక్కులు - ఇబ్బందుల గురించి ఈ పాట తెలియజేస్తుంది.
మహతి స్వర సాగర్ 'కృష్ణ వ్రింద విహారి' టైటిల్ సాంగ్ కు మంచి ట్యూన్ ని సమకూర్చారు. గేయ రచయిత కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ అందించగా.. గాయకుడు రామ్ మిరియాల తనదైన వాయిస్ తో ఎంతో హుషారుగా ఈ పాటను ఆలపించాడు.
ఈ సినిమాలో కృష్ణ అనే బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించాడు. ఒక మోడ్రన్ యువతిని ప్రేమించిన తర్వాత అతని లైఫ్ లో ఏమేమి జరిగాయి.. ఆ అమ్మాయి మరియు ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నాడు అనేది ఈ పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేసారు.
ఇందులో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించగా.. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - సత్య - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు.
'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో ఉషా మల్పూరి నిర్మించారు. సెప్టెంబర్ 23న ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా KVV టీమ్ ఈరోజు బుధవారం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తిరుపతి లో అలిపిరి మెట్టు నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ రోడ్ షో చేశారు. రేపటి నుంచి నెల్లూరు - ఒంగోలు - విజయవాడ - గుంటూరు - ఏలూరు - భీమవరం - రాజమండ్రి - కాకినాడ - వైజాగ్ లలో నాగశౌర్య అండ్ టీమ్ పాదయాత్ర నిర్వహించి ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.