హోలీ పండగ అంటేనే రంగుల సంబరం. ఈ పండగ కోసం ముందునుంచే ప్రీ ప్లానింగ్ గా ఉంటారు చాలామంది. బక్కెట్లు బక్కెట్లలో రంగునీళ్లు సిద్ధం చేసుకుని.. కనిపించిన వాళ్లందరిమీదా చల్లేసి తెగ హంగామా చేసేస్తారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం హోలీ పండుగను డిఫరెంట్ గా జరుపుకుంటోంది. ఒక్క చుక్క నీరు ఉపయోగించకుండా హోలీ చేసేసుకుంది మహేష్ బాబు వన్ నేనొక్కడినే లో నటించిన హీరోయిన్ కృతి సనోన్.
డ్రై హోలీ చేసుకోమని సలహా ఇస్తోంది. కేవలం సలహా మాత్రమే కాదు.. తను అలా వేడుక చేసుకుని, ఆ ఫోటోలను ట్వీట్ చేసి మరీ అందరినీ అలా పండగ చేసుకోవాలని సూచిస్తోంది. 'అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ సారి డ్రై హోలి చేసుకుని సరదాగా సంతోషంగా ఉండండి.. నీటిని ఆదా చేయండి' అంటూ ట్వీట్ చేసింది కృతి సనోన్. వాస్తవంగా చూస్తే ఈ భామ చెబుతున్న డ్రై హోలీ కాన్సెప్ట్ లో ఓ అర్ధం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నీటికి కటకటలాడే పరిస్థితి ఉంది. రైతులకు సాగుకే కాదు.. చాలా ఏరియాల్లో కనీసం తాగునీరు కూడా అందని పరిస్థితి ఉంది.
మరి వాళ్లకు తాగడానికి కూడా నీరు లేని సమయంలో.. పండగ పేరుతో ఆటల కోసం నీటిని వృథా చేయడం సరికాదన్నది డ్రై హోలీ కాన్సెప్ట్ ఉద్దేశ్యం. రంగులు చల్లుకోవడంతో పండుగ సరిపోతుంది కదా.. మళ్లీ నీటిని వృథా చేయడం ఎందుకు అన్నది వీరి ప్రశ్న. ఆలోచిస్తే.. ఇందులోనూ నిజం ఉందని అనిపిస్తుంది కదూ.