సుశాంత్ సూసైడ్ కు ప్రియురాలే కారణం.. పిటీషన్

Update: 2020-06-22 11:33 GMT
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వ్యవహారంలో వేడి ఇంకా చల్లారడం లేదు. తాజాగా సుశాంత్ ఆత్మహత్యకు అతడి ప్రియురాలైన నటి రియా చక్రవర్తినే కారణం అంటూ కుందన్ కుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశారు. బీహార్ లోని ముజఫర్ పూర్ కోర్టులో ఈ మేరకు పిటీషన్ దాఖలు చేశారు. సుశాంత్ నుంచి రియా పెద్ద మొత్తంలో డబ్బును తీసుకుందని కుందన్ పిటీషన్ లో పేర్కొన్నాడు. ఆమెనే మరణానికి కారణమని పిటీషన్ లో విన్నవించాడు.

ఇదివరకే బంధుప్రీతి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఇదే కుందన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. తాజాగా రియాపై మరో పిటీషన్ వేశాడు. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు జూన్ 24న కోర్టులో విచారిస్తామని తెలిపింది.

హీరో సుశాంత్ కు కుందన్ వీరాభిమాని. బీహార్ కే చెందిన సుశాంత్ అంటే పడిచస్తాడు. అతడి ఆత్మహత్యతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో మానస్తాపం చెందిన కోర్టులో అతడి చావుకు కారణమైన వారిపై పిటీషన్ దాఖలు చేశాడని కుందన్ లాయర్ మీడియాకు తెలిపాడు.
Tags:    

Similar News