‘జై లవకుశ’లో జై పాత్రకు సంబంధించి ఫస్ట్ టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు క్రేజ్ రావడానికి తొలి కారణం అదే. ఐతే ఆ తర్వాత వచ్చిన లవ టీజర్ యావరేజ్ అనిపించుకుంది. చివరగా వచ్చిన కుశ టీజర్ అయితే తేలిపోయింది. కుశ పాత్రలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. తెలుగు సినిమాల్లో ఎప్పుడో చూసిన దొంగ పాత్ర అది. పైగా ఈ పాత్రకు పెట్టిన డైలాగులు కూడా చాలా పేలవంగా అనిపించాయి. ఈ డబ్బులు తీసుకుని అమెరికాలో ఆ ఆధార్ కార్డేదో ఇప్పించేయండని ఎన్టీఆర్ అనడం.. దానికి బదులుగా ‘‘అది ఆధార్ కార్డు కాదు.. గ్రీన్ కార్డు’’ అని చెప్పడం.. ఇదంతా చాలా సాదాసీదాగా అనిపించింది. ఎప్పుడో దశాబ్దం కిందట వచ్చేవి ఇలాంటి జోకులు.
టీజర్లో ఏదో హడావుడి పడ్డారనుకుని వదిలేస్తే.. ఇప్పుడు ‘జై లవకుశ’ ట్రైలర్లోనూ ఇలాంటి జోక్ ఒకటి పెట్టారు. అది టీజర్లో చూసిన షాట్ కు కాస్త ముందు వచ్చేదన్నమాట. ‘‘ఈయనేరా మన ఇరిటేషన్ లాయర్’’ అంటాడు ఎన్టీఆర్. దానికతను.. ‘‘ఇరిటేషన్ కాదు.. ఇమ్మిగ్రేషన్ లాయర్’’ అంటాడు. ఈ జోక్ విని జనాలు మరో రకంగా నవ్వుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి వాటికే ‘ఉప్మా జోకులు’ అని పేరు. ఇలాంటి జోకులు ఎప్పుడో ఔట్ డేట్ అయిపోయాయి. టీజర్.. ట్రైలర్లో ఈ జోక్స్ వినగానే కుశ పాత్ర మీద జనాలకు ఆసక్తి పోయింది. ఇది మరీ రొటీన్ గా ఉంటుందేమో అనిపిస్తోంది. అందరి ఫోకస్ జై పాత్ర మీద ఉండగా.. లవ పాత్ర కూడా పర్వాలేదన్నట్లే అనిపిస్తోంది. కుశ పాత్ర మీద మాత్రం జనాలకు ఏ అంచనాల్లేవు. మరి సినిమాలో ఈ పాత్ర ఎలా ఉంటుందో?