లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్ రెడీ

Update: 2019-03-28 11:42 GMT
ఏ ఒక్క ఆర్టిస్టు పేరున్న వాళ్ళు లేకపోయినా కేవలం వివాదంతోనే ఫ్రీ పబ్లిసిటీ తెచ్చేసుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ రేపు విడుదలకు రెడీ అవుతోంది. తెలంగాణలో అన్ని కేంద్రాల్లో ఇప్పటికే బుకింగ్ మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కేంద్రాల్లో స్క్రీన్లు ఖరారు అయ్యాయి కానీ చాలా మటుకు బిసి సెంటర్స్ లో ఇప్పటికీ థియేటర్లు ఫైనల్ చేయలేదు. రాత్రిలోపు ఓ కొలిక్కి రావొచ్చు.

అధికార పార్టీ ఉన్న రాష్ట్రం కాబట్టి మద్దతుదారుల నుంచి నిరసన వస్తే లేనిపోనీ ఇబ్బందులు తప్పవని జంకుతున్న వాళ్ళు లేకపోలేదు. అందుకే వర్మ చాలా ప్లాన్డ్ గా ఇవాళ రాత్రి హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ ప్లాన్ చేశాడు. ఆ మేరకు మీడియా ప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ ముఖ్యులకు వర్మ సన్నిహితులకు మెసేజ్ వెళ్ళింది

సో రేపు ఉదయం ఇతర చోట్ల షో పడకముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏం ఉంది ఏం లేదు అనే క్లారిటీ వచ్చేస్తుంది. గతంలో ఇలా ప్రీమియర్లు వేయడం వల్ల లాభ పడిన వాటి కంటే నష్టపోయిన సినిమాలే ఎక్కువ. అయినా వర్మ ధైర్యం చేయడం చూస్తే కంటెంట్ మీద గట్టి నమ్మకమే కనిపిస్తోంది.

ఎన్టీఆర్ రెండో వివాహం జరిగిన తర్వాత ఏర్పడిన పరిణామాలు చంద్రబాబు వెన్నుపోటు ఉదంతం కీలక నేపధ్యంగా తీసుకున్న వర్మ సెన్సార్ అడ్డంకులు కోర్టు తీర్పులు అన్ని దాటుకుని ఫైనల్ స్టేజి దాకా వచ్చాడు. ఏ మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా వర్మను ఆపడం కష్టం. లేదూ తేడా కొట్టినా అందరికి అది అలవాటే కాబట్టి పెద్దగా ఏమి అనిపించదు. ఏదైతేనేం ఇవాళ అర్ధ రాత్రి లోపే లక్ష్మీస్ ఎన్టీఆర్ జాతకం తెలిసిపోతుంది
Tags:    

Similar News