ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ సినిమాను మించిన సస్పెన్స్ తో సాగిన లక్ష్మిస్ ఎన్టీఆర్ విడుదల వ్యవహారం కొలిక్కి వచ్చింది. మంగళగిరి కోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల ఇప్పటికే ఏపీలో రిలీజ్ ఆగిపోయింది. కానీ తెలంగాణలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా లక్ష్మిస్ ఎన్టీఆర్ థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ మేరకు వర్మతో పాటు సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ ట్వీట్లు పెట్టేశారు. తెలంగాణ హై కోర్ట్ ఇంతకు ముందే క్లియరెన్స్ ఇవ్వడం అక్కడ ఎన్నికల పరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవడం వల్ల హైదరాబాద్ లో రేపు షోలు ఉండబోతున్నాయన్న వార్త ఫైనల్ గా అఫీషియల్ అయిపోయింది.
ప్రసాద్ ఐమ్యాక్స్ లో 8.45 మొదలు ఆపై మిగిలిన స్క్రీన్లలో రెగ్యులర్ టైమింగ్ ప్రకారం బొమ్మ పడనుంది. అంతే కాదు ఉదయం 11.00 గంటలకు ఆంధ్రప్రదేశ్ కోర్టు స్టే గురించి వర్మ ప్రసాద్ ల్యాబ్ లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. ఇదీ ఆయనే ప్రకటించాడు. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప ఓవర్సీస్ లో సైతం లక్ష్మిస్ ఎన్టీఆర్ సాఫీగా విడుదల కాబోతోంది.
ఇదిలా ఉండగా ఇప్పటిదాకా ప్రేక్షకులు అభిమానులు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ ట్విట్టర్ల మీద పెద్ద కన్ను వేసి ఉంచారు. ఏదైనా అప్ డేట్ ఇస్తాడేమో అని ఎదురు చూస్తుంటే ఎట్టకేలకు వాళ్ళ నిరీక్షణ ఫలించింది. స్వయానా వర్మనే ప్రకటించడం తో సస్పెన్స్ వీగిపోయింది. ఏపీ రిలీజ్ కు సంబంధించి సుప్రీమ్ కోర్ట్ కు వెళ్తున్నామన్న వర్మ ట్వీట్ లో ఆ విషయం గురించి కాన్ఫిడెన్స్ చూపించడం గమనార్హం
సినిమాలో విషయం ఏమో కాని బయట జరుగుతున్న రచ్చలో అంతకు మించిన డ్రామా జరుగుతోంది. ఏపీ బిజినెస్ మీద ప్రభావం ఉంటుందని తెలిసినా తెలంగాణలో విడుదలకు రెడీ కావడం ఒకరకంగా సాహసమే. ఏదైతేనేం లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడాలని ముందస్తు బుకింగ్స్ చేసుకున్న ప్రేక్షకులకు వర్మ గుడ్ న్యూస్ అందించేశాడు. మరి ఏపి ఫ్యాన్స్ కోసం రేపు ప్రెస్ మీట్ లో ఏదైనా చెప్తాడేమో చూద్దాం.