సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హఠాన్మరణం తరువాత బాలీవుడ్ లో ఏ మూవీ విడుదలైనా వినిపిస్తున్న మాట #boycott. బాలీవుడ్ సినిమాలనే కాదు కంప్లీట్ గా బాలీవుడ్ నే బైకాట్ చేయండి అంటూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతూ వస్తోంది. నెటిజన్ లు, థియేటర్ల వద్దకు వెళితే సగు ప్రేక్షకుడు కూడా బైకాట్ అంటూ కామెంట్ లు చేస్తున్నాడు. తాజాగా ఆ సెగ ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ని తాకింది. అమీర్ ఖాన్ `థగ్స్ ఆఫ్ హిందుస్తాన్` తరువాత నటించిన మూవీ ఇది.
`థగ్స్ ఆఫ్ హిందుస్తాన్` 2018లో విడుదలై అమీర్ కెరీర్ లోనే అత్యంత డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితంతో షాక్ కు గురైన అమీర్ ఖాన్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత కరోనా వల్ల మరో రెండేళ్లు `లాల్ సింగ్ చద్దా` కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్`కు రీమేక్ గా ఈ మూవీని చేశారు.
అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి స్క్రిప్ట్ హిందీ అడాప్టేషన్ వర్క్ ని నటుడు అతుల్ కులకర్ణి చేశారు. ఈ మూవీ ద్వారా టాలీవుడ్ హీరో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 11న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని మేకర్స్ స్పీడప్ చేశారు. ఇదిలా వుంటే సినిమా రిలీజ్ కు మరో పది రోజులు మాత్రమే వుండటంతో నెట్టింట `#boycott Lal Singh Chadda` అంటూ హ్యాష్ ట్యాగ్ ని కొంత మంది నెటిజన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా అమీర్ సినిమాని ప్రత్యేకంగా బైకాట్ చేయడానికి ప్రధాన కారణాలని కూడా నెటిజన్స్ చెబుతున్న ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. గమనార్హం. `పీకె` మూవీలో అమీర్ ఖాన్ పాత్ర స్వామిజీలని, ఓ మతవాదుల్ని కించపరుస్తూ సాగుతుంది. ఆ సినిమా నుంచే అమీర్ పై ఓ వర్గం తీవ్ర వ్యతిరేకతని వ్యక్తం చేస్తూ వస్తోంది.
ఇక పలు సందర్భాల్లో అమీర్ ఖాన్ ..శివలింగానికి పాలాభిషేకం చేయడం వృథా అని ఆ పాలకు పెట్టే డబ్బుని ఆకలితో వున్న పేద పిల్లలకు ఖర్చు చేస్తే మంచిదని కామెంట్ లు చేశారని, ఇక అమీర్ ఖాన్ సినిమాలో నటించిన కరీనా కపూర్ మా సినిమాలు చూడకండి.. చూడమని మేము ఎవరినీ ఫోర్స్ చేయడం లేదంటూ కరీనా కామెంట్ చేసిందని నెట్టింట ఓ పోస్టర్ వైరల్ అవుతోంది. ` అంటే కాకుండా #boycott Lal Singh Chadda అంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.
Full View