తేజ్ కి `తిక్క` రేగేలా హీరోయిన్ కామెంట్

Update: 2021-09-23 04:32 GMT
ఇటీవ‌ల హీరో సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురై తీవ్ర గాయాల పాలైన విష‌యం తెలిసిందే. యాక్సిడెంట్ జ‌రిగిన వెంట‌నే అప‌స్మార‌క స్థిలోకి వెళ్లిన ఆయ‌న ప్ర‌స్తుతం కోలుకుంటున్నారు. ఓ మైన‌ర్ స‌ర్జ‌రీ త‌రువాత అపోలో హాస్పిట‌ల్ లో కోలుకుంటున్న సాయిధ‌ర‌మ్ తేజ్ క్షేమంగా ఇంటికి తిరిగిరావాల‌ని అత‌డి అభిమాన‌లతో పాటు సినీ ప్రియులు.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కోరుకుంటున్నారు.  ఇటీవ‌ల హాస్పిట‌ల్ కి వెళ్లి సాయిధ‌ర‌మ్ తేజ్ ఆరోగ్య ప‌రిస్థితిని హీరోయిన్ రాశీఖ‌న్నా  తెలుసుకున్న విష‌యం తెలిసిందే.

ఈ జాబితాలో మ‌రో హీరోయిన్ చేరింది. హీరో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని బ్రెజిలియన్ మోడల్‌.. నటిగా మారిన లారిస్సా బోనేసి ఆకాంక్షించారు. లారిస్సా టాలీవుడ్‌లో తేజ్ న‌టించిన తిక్క (2016) తో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆమె సోషల్ మీడియా వేదిక‌గా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.

`మీ నవ్వును మళ్లీ చూడటానికి మేమంతా వేచి ఉండలేము. ప్రతి సెకనులో మా ప్రార్థనలు మీతో ఉంటాయి. త్వరలో మిమ్మల్ని కలుస్తాను` అని లారిస్సా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసింది.

వీడియోలో లారిస్సా `తిక్క` షూట్ సమయంలో తేజ్ మంచి స్నేహితుడు .. గొప్ప మద్దతుదారుడు అలాగే నా అభిమాన హీరో అని చెప్పింది. ఈ వీడియో చూసి తేజ్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. బుధ‌వారం తేజ్ న‌టించిన `రిపబ్లిక్` చిత్రం ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా బాగుంద‌ని.. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త‌గా వున్నాడ‌ని ప్ర‌శంస‌లు కురిపించారు.

చిరు మాట్లాడుతూ.. ``తేజ్ కు యాక్సిడెంట్ జరిగినప్పటికీ అత‌ని కోరిక మేరకు సినిమా విడుదల ముందుకు సాగుతోంది. అనుకున్న ప్ర‌కారం గాంధీ జయంతి ముందు రోజైన అక్టోబ‌ర్ 1న రిలీజ్ చేస్తున్న  రిపబ్లిక్ గాంధీకి తగిన నివాళి అవుతుంది`` అని అన్నారు.
Tags:    

Similar News