ఫోటోటాక్: పొట్ట‌లో బుజ్జాయిని దాచేసిన చంద‌మామ‌?

Update: 2022-04-12 07:30 GMT
చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్  కొన్ని నెల‌లుగా బేబి బంప్ లుక్ తో ఇన్ స్టాలో ద‌ర్శ‌న‌మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాజ‌ల్ గ‌ర్భం దాల్చిన ద‌గ్గ‌ర నుంచి బేబి బంప్ ఫోటోల్ని ఇన్ స్టాలోకి అదే ప‌నిగా డంప్ చేస్తుంది. బుజ్జాయి ఊహ‌ల్లో తేలుతూ అదే రెట్టించిన ఉత్సాంహంతో ఫోటో సెష‌న్స్ లో పాల్గొంటుంది.  విభిన్న ర‌కాల క్యాజువ‌ల్ వేర్స్ లో బేబి బంప్ లుక్ తో నెటి జ‌నుల్ని ఆక‌ట్టుకుంటుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ వారంలో మూడు ..నాలుగు ఫోటోలు చోప్పున క‌వ‌ర్ చేసుకుంటూ వ‌చ్చింది. త‌రుచూ  బేబి బంప్ లుక్ ఫోటోల‌తో బోర్ కొట్టిస్తాన్నానేమో అన్న ఫీలింగ్ తోల  మ‌ధ్య మ‌ధ్య‌లో పాత ఫోటోల్ని ఇన్ స్టాలో షేర్ చేసి కొత్త కిక్ ని పంచే ప్ర‌య‌త్నం చేసింది.  తాజాగా చంద‌మామ ఓ కొత్త ఫోటో ఒక‌టి షేర్ చేసింది. బేబి బంప్ లుక్ లోనూ రెండు చేతులు పైకెత్తి  కాజ‌ల్ స్టైలిష్ గా క్యామ్ కి  ఫోజులిచ్చింది.

శ‌రీరానికి బాగా  సౌక‌ర్యంగా ఉండే  న‌లుపు దుస్తులు ధ‌రించి బేబిని ఆకాస్ట్యూమ్స్ లో దాచేసే ప్ర‌య‌త్నం క‌నిపిస్తుంది. హెయిర్ ని సైతం ఎంతో స్టైలిష్ గా కెమెరా యాంగిల్ కోసం ఆవిష్క‌రించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. కాజ‌ల్ అభిమానులు సో  బ్యూటీఫుల్..ల‌బ్ సింబ‌ల్ తో కూడిన ఎమోజీలు పోస్ట్ చేస్తున్నారు. అలాగే పొట్ట‌లో బుజ్జాయి జాగ్ర‌త్త అంటూ సూచ‌న‌లు..స‌ల‌హాలు ఇస్తున్నారు.

ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే తమిళ్..తెలుగు..హిందీ అంటూ మూడు భాషల్ని చుట్టేస్తోంది. కోలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తయ్యాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య' నటిస్తోంది. చిరంజీవితో కలిసి నటించడం ఇది రెండవ సారి. గతంలో 'ఖైదీ  నెంబర్ 150' లో మెగాస్టార్ కి జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది.

అదే సెంటిమెంట్ తో  కొరటాల శివ మరోసారి కాజల్ ని చిరు సరసన 'ఆచార్య'లో రిపీట్ చేసారు. 'ఇండియన్ -2' లో విశ్వ నటుడు  కమల్ హాసన సరసన నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది.

కాజల్ పై చిత్రీకరణకు సంబంధించి దాదాపు షూట్ పూర్తయినట్లు సమాచారం. కాజల్ గర్భం దాల్చిన తర్వాత  షూటింగ్ లకు దూరమైంది. దీంతో  కొత్త ప్రాజెక్ట్ లు తగ్గుముఖం పట్టాయి.
Tags:    

Similar News