ఆ ఒక్క ఆప్షన్ ను ఎంపిక చేసుకున్న 'ఆచార్య'

Update: 2021-09-01 03:38 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య మూవీ విడుదలకు సిద్దం అయ్యింది. గత ఏడాది విడుదల చేయాలనుకున్న ఆచార్య ఈ ఏడాది అయినా విడుదల అయ్యేనా అనుమానాలు ఇంకా కొందరిలో ఉన్నాయి. కేవలం వంద వర్కింగ్ డేస్‌ లో సినిమాను పూర్తి చేస్తాను అంటూ కొరటాల శివ చాలా నమ్మకంగా బలంగా చెప్పాడు. అన్నట్లుగానే చాలా స్పీడ్ గా చిత్రీకరణ చేస్తున్న సమయంలో కరోనా వచ్చింది. దాంతో ఏడాది పాటు సమయం వృదా అయ్యింది. సరే ఈ ఏడాది మే లో అయినా సినిమా విడుదల చేయాలనుకున్నా ఆచార్యకు కరోనా సెకండ్‌ వేవ్‌ అడ్డు వచ్చింది. ఆచార్య సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌ పూర్తి చేసి దసరాకు వస్తుందని అంతా భావించారు. ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ను తప్పించడం వల్ల దసరా బరిలో ఆచార్య ను దించడం దాదాపుగా కన్ఫర్మ్‌ అనుకున్నారు.

దసరాకు ఏదో కారణం వల్ల చిరంజీవి ఆసక్తి చూపించడం లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. దసరా తప్పితే దీపావళి మాత్రమే ఆచార్యకు ఆప్షన్ గా ఉంది. ఎందుకంటే క్రిస్మస్ మరియు సంక్రాంతి సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యాయి. ఇక వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్‌ చేసినా కూడా చాలా సినిమాలు విడుదల కోసం వెయిట్‌ చేస్తున్నాయి. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్‌ సినిమాలు కూడా వచ్చే సమ్మర్ వరకు విడుదలకు సిద్దం అవ్వబోతున్నాయి. కనుక మరీ ఆలస్యం చేయడం వల్ల నష్టం తప్ప లాభం లేదు అనే ఉద్దేశ్యంతో దీపావళికి విడుదల చేసే ఉద్దేశ్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా లో చిరంజీవి తో పాటు రామ్‌ చరణ్‌ కూడా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్‌ నటించగా రామ్‌ చరణ్‌ కు జోడీగా పూజా హెగ్డే గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతుంది. రెజీనా ఐటెం సాంగ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ సంగీత కీలక పాత్రలో కనిపించబోతుంది. ఎంతో మంది ప్రముఖ నటీ నటులు నటించిన ఈ సినిమాకు సంగీతాన్ని మణిశర్మ అందించాడు.

ఇప్పటికే విడుదల అయిన లాహె లాహె పాట అందరి ప్రశంసలు దక్కించుకుంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడంతో పాటు మెగా ఫ్యాన్స్ రాబోయే పదేళ్ల వరకు గుర్తుంచుకునేలా మెగా తండ్రి కొడుకుల ఆచార్య ఉంటుందని అంటున్నారు. ఆచార్య సినిమా దీపావళికి వచ్చినా ఎప్పుడు వచ్చినా రికార్డు వసూళ్లు ఇచ్చేందుకు మేము సిద్దంగా ఉన్నామంటూ అభిమానులు చెబుతున్నారు. థర్డ్‌ వేవ్‌ అప్పటి వరకు లేకుంటే ఆచార్య సినిమాను దీపావళికి విడుదల చేయడం దాదాపుగా ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆచార్య ముందు ఆ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది కనుక అదో రోజు రావాల్సిందే అంటున్నారు.
Tags:    

Similar News