అక్కినేని అమ‌ల మెచ్చిన `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ`!

Update: 2022-03-23 14:30 GMT
తెలంగాణ ప్ర‌త్యేక రాష్ర్టంగా ఏర్పాటైన త‌ర్వాత ఇక్క‌డి సంస్కృతిని వెలుగులోకి తీసుకొచ్చే ప‌లు సినిమాలు..డాక్యుమెంట‌రీలు ఇటీవ‌ల త‌రుచూ వెలుగులోకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ సంప్ర‌దాల్ని హైలైట్ చేస్తూ వ‌స్తోన్న ల‌ఘు చిత్రాల‌కు సోష‌ల్ మీడియా ద్వారా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప్రేక్ష‌కుల‌కు కొత్త ఫీల్ ని అందిస్తున్నాయి.

త‌ద్వారా తెలంగాణ సంస్కృతి విశ్వ వ్యాప్త‌మ‌వుతోంది. తాజాగా పేర్ని నృత్య రూప‌క‌ర్త డా న‌ట‌రాజ రామ‌కృష్ణ 100వ జయంతి వేడుల‌కు ఇటీవ‌లే హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ` అనే  డాక్యుమెంట‌రీ ప్ర‌ద‌ర్శ‌న అన్న‌పూర్ణ స్టూడియో మినీ థియేట‌ర్లో జ‌రిగింది. ఈ షోకి అమ‌ల అక్కినేని అతిధిగా హాజ‌రై డాక్యుమెంట‌ర‌నీ మెచ్చారు.

``డాన్స్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. క‌ళ అనేది బ్ర‌తికున్నంత‌కాలం ఉంటుంది. రుక్ముణీదేవి చెప్పిన‌ట్లు డాన్స్ అనేది ఓ యోగా లాంటిది. మ‌న‌లో శ‌క్తి..సామ‌ర్ధ్యాల్ని వెలికి తీస్తుంది. జీవితంలో ఉన్న‌తంగా ఎలా ఉండాల‌నేది వెలికి తీస్తుంది. చాలా మంది కంప్యూట‌ర్ ముందు కుర్చున్న‌వారు ఎక్కువ‌గా ఒత్త‌డికి గుర‌వుతున్నారు. అలాంటి వారికి డాన్స్ అనేది  మంచి వ్యాయామంలా ప‌నిచేస్తుంది.

అదే స‌మ‌యంలో యోగా చేసిన ఫ‌లితాలు ద‌క్కుతాయి. యువ‌త ఇలాంటివి అల‌వ‌ర్చుకోవాలి. డాన్స్ పై డాక్యుమెంట‌రీ చేయ‌డం ప్ర‌శంస‌నీయం. అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మించ‌డం ఇంకా సంతోషాన్నిస్తుంది. మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల్ని ఇప్ప‌టి యువ‌త‌కి తెలియ‌జేసేలా స‌మీర్ చేసిన ప్ర‌యోగం బాగుంది. డాన్స్ ..సినిమా అనేది ఒక‌దానికొక‌టి స‌మ‌న్వ‌యం అవుతుంటాయి. నేను కళా క్షేత్రంలో గ్రాడ్యూష‌న్  చేస్తుండ‌గా చాలా మంది సినిమాల వైపు మ‌ళ్లారు.

కానీ నేను డాన్స్ ని ఎంచుకున్నాను` అని  తెలిపారు. మొత్తానికి అమ‌లకి సినిమాలు క‌న్నా డాన్స్ అంటే ఎంతో ఇస్ట‌మ‌ని ఈ సంద‌ర్భం ద్వారా బ‌య‌ట‌ప‌డింది.  అమ‌ల మంచి క్లాసిక్ డాన్స‌ర్. ఈ విష‌యంపై అమ‌ల ఎప్ప‌డూ ఓపెన్ కాలేదు. ప‌లు సంద‌ర్భాలో నాగార్జున చెప్పేవారు. ఇక  `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ` డాక్యుమెంట‌రీని సుప్రియ యార్ల‌గ‌డ్డ నిర్మించారు. కాన్సెప్ట్  క్రియేట‌ర్..సినిమాటోగ్రాఫ‌ర్ డి. స‌మీర్ కుమార్ ఆధ్య‌ర్యంలో రూపొందింది. స‌మీర్ గ‌తంలో `ధృవ‌`.. `హ‌లో`.. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రాల‌కు ప‌నిచేసారు.
Tags:    

Similar News