ఒకప్పుడు వెండితెరపై కథానాయికలు చాలాకాలం పాటు కొనసాగారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను చాలా సినిమాలే చేశారు. ఈ మధ్య కాలం వరకూ కూడా పదేళ్లకు పైనే నాన్ స్టాప్ గా తమ జోరును కొనసాగించినవారున్నారు.
కానీ ఆ తరువాత హీరోయిన్ల కెరియర్ గ్రాఫ్ చాలా వేగంగా తగ్గుతూ వస్తోంది. గతంలో కంటే పోటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. ఒక భాషలో అవకాశాలు తగ్గితే మరో భాషకి మకాం మార్చడం తప్పనిసరి అయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కాస్త అవకాశాలు తగ్గిన కథానాయికల పాలిట వరమై కూర్చుంది. ఓటీటీలు ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తున్నాయి .. టాక్ షోలు రూపొందిస్తున్నాయి .. గేమ్ షోలను తీసుకొస్తున్నాయి. 'ఆహా' ఇచ్చే కంటెంట్ లో కూడా ఎక్కువగా హీరోయిన్స్ కనిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలను నడిపించే బాధ్యతను వారు కూడా దాదాపు హీరోయిన్స్ కే అప్పగిస్తున్నారు. అలా తాజాగా 'ఇండియన్ ఐడల్' సింగింగ్ ప్రోగ్రామ్ ను నిత్యామీనన్ కి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఆమె సింగర్ కార్తీక్ .. తమన్ తో కలిసి జడ్జ్ గా కనిపించనుంది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమో రన్ అవుతోంది. ఒక కంటెస్టెంట్ నిత్యామీనన్ తో కలిసి డాన్స్ చేస్తానని కోరాడు. ఇది డాన్స్ షో కాదని చెప్పినా అతను వినిపించుకోలేదు. అలాగే మరో కంటెస్టెంట్ ఆమె కోసం రాసిన కవిత రూపంలోని లవ్ లెటర్ ని స్టేజ్ పైనే చదివి వినిపించాడు.
అలా ఈ కార్యక్రమం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తోంది. నిత్యామీనన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆమెను ఇష్టపడతారు. పైగా నిత్యామీనన్ మంచి సింగర్ .. కొన్ని సినిమాల్లో పాటలు పాడింది కూడా. ఆమెకి పాటలపై మంచి పట్టు .. కాస్త స్వరజ్ఞానం ఉండటం వల్లనే ఈ కార్యక్రమాన్ని అప్పగించారనుకోవాలి.
నిత్యామీనన్ కి తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. అందమైన కళ్లతో హావభావాలను అద్భుతంగా ఆవిష్కరించే కథానాయికగా ఆమె ఎంతోమంది మనసులను గెలుచుకుంది. ఇక స్కిన్ షో చేయకుండా స్టార్ డమ్ ను అందుకున్న అతి తక్కువమంది కథానాయికలలో ఆమె ఒకరు. ఈ మధ్య కాలంలో ఆమెకి అవకాశాలు తగ్గాయనే అనుకోవాలి. అలా అవకాశాలు తగ్గడం వలన ఓటీటీ షోస్ వైపు వచ్చిన ప్రియమణికి మళ్లీ సినిమాల వైపు నుంచి అవకాశాలు పెరిగాయి. అలాగే నిత్యామీనన్ కూడా బిజీ అవుతుందేమో చూడాలి.